https://oktelugu.com/

ఉప్పెనకు భారీ ఆఫర్ !

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు గానూ మాంచి ఆఫర్ వచ్చింది. అవుట్ రేట్ న, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 18 కోట్లు ఇస్తామని బయ్యర్ వచ్చారు. కానీ, నైజాంకు దిల్ రాజుకు ఎప్పడో నాలుగు కోట్లకు మాట ఇచ్చారట. ఆయన గట్టిగా పట్టుకుని కూర్చోవడంతో నిర్మాతలు లాస్ అయిపోయారట. లేకపోతే, నైజాంలో కూడా […]

Written By:
  • admin
  • , Updated On : February 2, 2021 / 05:49 PM IST
    Follow us on

    మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు గానూ మాంచి ఆఫర్ వచ్చింది. అవుట్ రేట్ న, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 18 కోట్లు ఇస్తామని బయ్యర్ వచ్చారు. కానీ, నైజాంకు దిల్ రాజుకు ఎప్పడో నాలుగు కోట్లకు మాట ఇచ్చారట. ఆయన గట్టిగా పట్టుకుని కూర్చోవడంతో నిర్మాతలు లాస్ అయిపోయారట. లేకపోతే, నైజాంలో కూడా మరో ఐదారు కోట్లు వరకూ వచ్చేవి. ఇక ఈ సినిమాకి మొత్తం 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికే.. ఎనిమిది కోట్లు వరకు లాభాల్లో ఉంది ఉప్పెన.

    Also Read: మ‌హా స‌ముద్రం కోసం గోవాలో స్పెషల్ ‘సెట్’

    ఇక ఏ యాక్షన్ కథతోనే లేక కామెడీ సినిమాతోనే వైష్ణ‌వ్‌ తేజ్ లాంచ్ అవొచ్చు. కానీ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్రలో వైష్ణ‌వ్‌ కనిపించబోతుండటం, పైగా ఉప్పెన ఓ విషాద వంతమైన ప్రేమ కథ అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పైగా ప్రేమలో విఫలమైన జంటగా మిగిలినప్పటికీ, హీరోహీరోయిన్లు జీవితంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారని.. సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా సినిమా పాయింట్ మరీ కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    Also Read: ఇప్పుడు రెడీ… అప్పుడు మెచ్యూరిటీ లేక నో చెప్పాను

    వాటిల్లో బాగా వైరల్ అయిన న్యూస్ ఏమిటంటే.. హీరో పాత్ర డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని ఏకంగా అతని మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారని.. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఇక ఆ హీరో ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్)కి కనబడకుండా తిరుగుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ యువకుడి(హీరో) కోసమే పరితపిస్తూ ఉంటుంది. చివరికి ప్రేమకు కావాల్సింది మగతనం కాదు, మనసు అని ఆమె ఆతన్ని ఒప్పించి ఫైనల్ గా వారు ఒక్కటవుతారట. మొత్తానికి సినిమా కథ ఇంటరెస్టింగ్ గానే ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.