Allu Arjun : ఒరేయ్ అల్లు అర్జున్… నువ్వు ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకోవడం ఏంట్రా!

అందుకే నేను అవార్డు గెలిచాను. సుకుమార్ స్వార్థం లేని డైరెక్టర్. ఆయనే మూలకారణం అని ఎమోషనల్ అయ్యాడు...

Written By: NARESH, Updated On : October 22, 2023 7:02 pm
Follow us on

Allu Arjun : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డులు ప్రదానం కార్యక్రమం జరిగింది. జాతీయ అవార్డుకు ఎంపికైన వివిధ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ కి మొత్తం 11 విభాగాల్లో అవార్డులు దక్కాయి. అత్యధికంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 6 నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది.

అల్లు అర్జున్ గెలుచుకున్న ఉత్తమ నటుడు చాలా ప్రత్యేకం. టాలీవుడ్ నుండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. పుష్ప చిత్రంలో నటనకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ సైతం అవార్డు గెలుచుకున్నారు.

ఈ క్రమంలో వేదికపై అల్లు అర్జున్, దేవిశ్రీ సందడి చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ… నేను ఎప్పుడు దేవీశ్రీని కలిసినా బాలీవుడ్ కి వెళ్ళు అని చెప్పేవాడిని. ముందు నువ్వు వెళ్ళు. నీతో పాటు నేను వచ్చేస్తా అనేవాడు దేవి. దేవిశ్రీ అన్నట్లే రెండు దశాబ్దాల తర్వాత పుష్ప మూవీతో ఇద్దరం బాలీవుడ్ లో అడుగుపెట్టాము. మేము నేషనల్ అవార్డ్స్ గెలిచామంటే నమ్మబుద్ది కావడం లేదు. చెన్నైలో బేవర్స్ గా తిరిగే మేము, ఏనాడూ స్కూల్ లో చిన్న సర్టిఫికెట్ కూడా తీసుకోని మేము ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడం ఏంటీ…

మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి… ఎప్పుడూ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర టీసీలు తీసుకునే మీరు ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుంటే బాధగా ఉంది, అన్నాడు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. నాన్న అల్లు అరవింద్ నాకంటే దేవిశ్రీకి అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు. నాకు ఈ అవార్డు రావడనికి నా చుట్టూ ఉన్నవాళ్లే కారణం. అందుకే నేను అవార్డు గెలిచాను. సుకుమార్ స్వార్థం లేని డైరెక్టర్. ఆయనే మూలకారణం అని ఎమోషనల్ అయ్యాడు…