Congress Crisis: కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరూ కాంగ్రెస్ ను వీడుతున్నారు. కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం నడిచిన వారు సైతం నాయకత్వ పోకడలు నచ్చక గుడ్ బై చెబుతున్నారు. 2014లో జాతీయ స్థాయిలో అధికారానికి దూరమైన నాటి నుంచి పార్టీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు ఒక్కో రాష్ట్రం అధికారానికి దూరమవుతూ వస్తోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అజేయ శక్తిగా ఎదుగుతుండగా..కాంగ్రెస్ మాత్రం పతన స్థితికి చేరుకుంటోంది. ఓటమి ఎదురైన ప్రతీసారి మేథోమథనంతో సరిపెడుతున్న పార్టీ విరుగుడు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ఏరికోరి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గడిచిన కొద్దికాలంలోనే 13 మంది ముఖ్యనేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇందులో గాంధీ కుటుంబసన్నిహితులు ఉన్నారు. ఇప్పటి అగ్రనేతలు సోనియా, రాహుల్ అనుంగ శిష్యులు సైతం తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిపోయారు.నాటి జ్యోతిరాధిత్య సింధియా నుంచి నేటి గులాం నబీ ఆజాద్ వరకూ ఈ రెండేళ్ల వ్యవధిలో వరుసగా మ13 మంది ‘కీ’లక నేతలు గుడ్ బై చెప్పడం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. అదంతా కాంగ్రెస్ పార్టీ స్వయంకృతపామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని వీడిన ఆ 13 మంది నేతల వివరాలివి.

గులాంనబీ ఆజాద్ ది స్ పార్టీతో 50 సంవత్సరాల అనుబంధం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలను, ఉన్నత పదవులను దక్కించుకున్నారు ఈ కశ్మీరి నేత. 2019 ఎన్నికల్లో రెండో సారి ఓటమి తరువాత నాయకత్వ మార్పును కోరుకున్న కీలక నేతల్లో ఈయన ఒకరు. ఆయన విన్నపాలను కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో విసిగి వేశారిపోయిన ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Also Read: Lemongrass Products: కరువుతో అల్లాడే ‘వనపర్తి’ ఈ మొక్కతో ఎందుకు సంతోషంగా ఉంది?
తెలంగాణాకు చెందిన సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా మారింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు.
రాహుల్ గాంధీ సన్నిహితుడు, యువ నాయకుడు జ్యోతీరాధిత్య సింధియా కూడా 2020లో కాంగ్రెస్ ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన జితిన్ ప్రసాద్ 2021లో కాంగ్రెస్ పార్టీని వీడారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం నడిచారు సీనియర్ నేత కపిల్ సిబల్. కానీ నాయకత్వంతో విభేదించి పార్టీని వీడారు. కొద్దిరోజులకే సమాజ్ వాది పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

గుజరాత్ కు చెందిన హార్థిక్ పటేల్ ఈ ఏడాది జూన్ లో కాంగ్రెస్ ను వీడారు. పటిదార్ సామాజికవర్గంలో బలమైన నేతగా పేరు తెచ్చుకున్న హార్థిక్ పటేల్ అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు.
గాంధీకుటుంబానికి సన్నిహితురాలిగా పేరున్న సుష్మితా దేవ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అసోం కు చెందిన ఆమె 2021లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా పార్టీని వీడారు. బీజేపీలో చేరారు.
యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్న అశ్విన్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీని వీడారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆర్ఎన్పీ సింగ్ సైతం పార్టీని వీడారు. యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్న ఈయన అనూహ్యంగా బీజేపీ గూటికి చేరారు.
సీనియర్ న్యాయవాది జైవీర్ షిర్గెల్ కాంగ్రెస్ లో క్రియాశీలక నేత. కానీ రెండు రోజుల కిందట ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
హర్యానకు చెందిన కుల్దీప్ బిష్ణోయ్ ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు..రెండేళ్లలో 13 మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.
Also Read:Lemongrass Products: కరువుతో అల్లాడే ‘వనపర్తి’ ఈ మొక్కతో ఎందుకు సంతోషంగా ఉంది?
[…] […]