https://oktelugu.com/

Naga Chaitanya: చాలా బోర్ గా అనిపించింది అందుకే డిస్కనెక్ట్ అయ్యా… పర్సనల్ మేటర్ చెప్పిన చైతూ

Naga Chaitanya: విడాకుల వ్యవహారం తర్వాత నాగ చైతన్య, సమంత ప్రతి రోజూ మీడియాలో నలుగుతున్నారు. టాప్ సెలెబ్రిటీలు కావడంతో వీరి వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల కొంతలో కొంత విడిపోవడానికి కారణాలు చెప్పారు. అయితే ఇద్దరి సమాధానాలకు పొంతన లేకపోవడం గమనించాల్సిన విషయం. పరస్పర అవగాహనతో విడిపోయినట్లు నాగచైతన్య చెప్పారు. సమంత మాత్రం అంత స్మూత్ గా జరగలేదు, ఘర్షణ చోటు చేసుకుంది అంటున్నారు. అదే సమయంలో చైతుపై సమంత విపరీతమైన కోపం ప్రదర్శిస్తుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 27, 2022 / 11:02 AM IST
    Follow us on

    Naga Chaitanya: విడాకుల వ్యవహారం తర్వాత నాగ చైతన్య, సమంత ప్రతి రోజూ మీడియాలో నలుగుతున్నారు. టాప్ సెలెబ్రిటీలు కావడంతో వీరి వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల కొంతలో కొంత విడిపోవడానికి కారణాలు చెప్పారు. అయితే ఇద్దరి సమాధానాలకు పొంతన లేకపోవడం గమనించాల్సిన విషయం. పరస్పర అవగాహనతో విడిపోయినట్లు నాగచైతన్య చెప్పారు. సమంత మాత్రం అంత స్మూత్ గా జరగలేదు, ఘర్షణ చోటు చేసుకుంది అంటున్నారు. అదే సమయంలో చైతుపై సమంత విపరీతమైన కోపం ప్రదర్శిస్తుంది. కరణ్ జోహార్ షోలో ఆమె చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం.

    Naga Chaitanya

    విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా ద్వారా నాగ చైతన్యను టార్గెట్ చేసింది. ఆమె నిఘూఢమైన అర్థంతో కూడిన కోట్స్ పోస్ట్ చేసేది. సదరు పోస్ట్స్ గమనిస్తే నాగ చైతన్య ఆమెను మానసిక వేదనకు గురి చేశారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని పరోక్షంగా చెప్పినట్లు ఉండేవి. నాగ చైతన్య మాత్రం చాలా సైలెంట్ గా ఉండిపోయారు. కనీసం ఆయన ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేసేవారు కాదు.

    Also Read: Yawn During Pooja: పూజ చేసేటప్పుడు ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా?

    అసలు నాగ చైతన్య సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటారు? అనే ప్రశ్నకు తాజాగా ఆయన సమాధానం చెప్పారు. అందరికీ భిన్నంగా నాగ చైతన్యకు సోషల్ మీడియా చాలా బోరింగ్ అట. ఆన్లైన్ లో ఉండటం, అప్డేట్స్ చెక్ చేయడం అతనికి నచ్చదట. తన సినిమాలు గురించి పోస్ట్స్ పెట్టడానికి కూడా ఇష్టపడరు అట. దానికి బదులు తన సినిమాలకు సంబంధించిన ఆర్టికల్స్ చదవడానికి ఇష్టపడతారట. సోషల్ మీడియా బోరింగ్ నాకు, అందుకే డిస్కనెక్ట్ అయ్యానని చెప్పాడు.

    Naga Chaitanya

    అలాగే సోషల్ మీడియాలో చెడు మంచి మధ్య తేడా గమనించి ఫిల్టర్ చేసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతామని నాగ చైతన్య హితవు పలికాడు. ఇక నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ దారుణ పరాజయం చవిచూసింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. అలాగే దూత టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో ఇది విడుదల కానుంది.

    Also Read:Priyanka Singh: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి… వరుడు ఎవరంటే? హల్దీ ఫోటోలు వైరల్

     

     

    Tags