Hanuma Vihari controversy : ఆంధ్రా జట్టు తరఫున ఆడబోను.. షాకింగ్ విషయాలు వెల్లడించిన క్రికెటర్

తన ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని, ఎప్పటికీ ఆంధ్రా జట్టుకు ఆడ బోనని స్పష్టం చేశాడు.. కాగా, హనుమ విహారి(Hanuma Vihari) కెప్టెన్సీ కోల్పోవడానికి ఓ అధికార పార్టీ నాయకుడు కారణమని పుకార్లు వినిపిస్తున్నాయి..

Written By: NARESH, Updated On : February 26, 2024 7:18 pm
Follow us on

Hanuma vihari : “కెప్టెన్సీ నుంచి నన్ను ఎందుకు తప్పించారో తెలుసు. ఆంధ్రా జట్టు తరఫున ఆడబోను” అని భారత క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari) సంచలన కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించి తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో సంచలన ట్వీట్లు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) లో కలకలం చెలరేగింది. దీనికి రాజకీయాలు కూడా తోడు కావడంతో ఏపీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

హనుమ విహారి(Hanuma Vihari) దేశవాళి రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. జట్టును విజయవంతంగా నడిపించాడు. అతడి ఆధ్వర్యంలో చివరి ఏడు సంవత్సరాల లో నాలుగు సార్లు ఆంధ్రా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. ఇక ఈ సీజన్లో క్వార్టర్ ఫైనల్ లో నాలుగు పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. కారణం చెప్పకుండానే ఈ ఏడాది సీజన్ మధ్యలోనే హనుమ విహారి(Hanuma Vihari) ని కెప్టెన్సీ నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) తొలగించింది.. తనను తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో? హనుమ విహారి(Hanuma Vihari) చెప్పేశాడు.. దీంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) కలకలం నెలకొంది.

“ఒక రాజకీయ నాయకుడి కుమారుడు నా కెప్టెన్సీ పోవడానికి కారణం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. బెంగాల్ తో జరుగుతున్న మ్యాచ్ కు నేను కెప్టెన్ గా ఉన్నాను. ఆటలో భాగంగా ఆ మ్యాచ్లో 17వ ఆటగాడి పై నేను అరిచాను. దీంతో అతడు తన తండ్రికి ( రాజకీయ నాయకుడు) ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఆటగాడి తండ్రి నాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA)పై ఒత్తిడి తీసుకొచ్చాడు. గత ఏడాది ఫైనలిస్ట్ బెంగాల్ జట్టుపై 410 పరుగులను చేదించి నేను జట్టును గెలిపించాను. అయినప్పటికీ నన్ను కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నారు. నేను ఆటగాడిని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. ఆట కోసం నా శరీరాన్ని కూడా ఫణంగా పెట్టాను. గత ఏడాది లెఫ్ట్ హ్యాండ్ తో ఆట కూడా ఆడాను. గడిచిన ఏడు సంవత్సరాల లో ఐదుసార్లు ఆంధ్రా జట్టును నాకౌట్ దశకు తీసుకెళ్లాను. టీమిండియా కు 16 టెస్టులు ఆడాను. అలాంటి నన్ను కాదని ఫిర్యాదులు చేసిన వ్యక్తే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA)కు ముఖ్యమైయ్యాడని” హనుమ విహారి(Hanuma Vihari) పేర్కొన్నాడు.

“నేను ఎటువంటి తప్పు చేయకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నారు. అది నాకు అత్యంత అవమానకరంగా అనిపించింది. అయినప్పటికీ ఆట పట్ల నాకు ఉన్న గౌరవం వల్ల ఈ సీజన్లో ఆటగాడిగా కొనసాగాను. తాము ఏం చెబితే ఆటగాళ్లు అదే చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) బాధ్యులు భావిస్తున్నారు.. వాళ్ల వల్లే మాలాంటి ఆటగాళ్లు ఉన్నారు అని అనుకుంటున్నారు.. కానీ అది ముమ్మాటికీ తప్పు. నాకు ఎంత అవమానం అనిపించినప్పటికీ ఇప్పటివరకు ఆ విషయాన్ని వెల్లడించలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదని” హనుమ విహారి(Hanuma Vihari) వివరించాడు. తన ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని, ఎప్పటికీ ఆంధ్రా జట్టుకు ఆడ బోనని స్పష్టం చేశాడు.. కాగా, హనుమ విహారి(Hanuma Vihari) కెప్టెన్సీ కోల్పోవడానికి ఓ అధికార పార్టీ నాయకుడు కారణమని పుకార్లు వినిపిస్తున్నాయి..

ఇక హనుమ విహారి(Hanuma Vihari) టీమిండియా తరఫున కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై 2021 సిడ్నీలో జరిగిన టెస్ట్ లో విరోచితమైన బ్యాటింగ్ చేసి భారత జట్టును ఓటమి నుంచి తప్పించాడు. టీమిండియా తరఫున 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన హనుమ విహారి(Hanuma Vihari) 839 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.