Wrestler Hamida Banu: భారతదేశపు మొదటి మల్ల యోధురాలు హమీదా బాను. ఓటమి ఎరుగని ధీర వనిత. పేరు గడించిన పురుష రెజ్లర్లను కూడా మట్టికరిపించిన యోధురాలు. ఈమె పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నా.. వాటి గురించి ప్రస్తావన లేదు. ఆమె చరిత్ర ఇప్పటికీ రహస్యంగా ఉండిపోయింది. అసమాన ప్రతిభ కనబరిచిన హమీదా బాను పేరును దాదాపుగా వినిపించడం లేదు. ఆమె విశేషమైన విన్యాసాలకు సంబంధించిన అధికారిక రికార్డులేవీ లేవు. ఒక మహిళ క్రీడారంగంలో పరాక్రమమైన విజయాలను గుర్తించబడకుండా జరుపుకోకుండా ఉండటం శోచనీయం.
1950 నాటి పురుషాధిక్య కాలంలో ఒక మహిళ రెజ్లర్ గా ప్రయాణం సాగించడం సాహసించదగ్గ విషయమే. హమీదా బానో రెజ్లింగ్ ను అసహాస్యం చేసేందుకు పురుష మల్ల యోధులు సిద్దంగా ఉండేవారు. దేనికీ వెనుకాడని ఆమె మహిళలనే కాకుండా పురుష రెజ్లర్లను కూడా తనతో పోటీకి రావాలని, తనను ఓడించిన వారిని వివాహం చేసుకుంటానని బహిరంగంగా సవాల్ విసిరేవారు. బహుశా అప్పటి ఆధిపత్యంపైనా ఆమె పోరాటం చేయాల్సి వచ్చిందేమో.
హమీదాబానో అప్పట్లో ఒక సంచలనం. పత్రికల్లో ప్రముఖంగా ఆమె ప్రస్తావన ఉండేది. ఆమె రెజ్లింగ్ కు వస్తున్నారంటే, ఆమె ఆట తీరును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఆమె బరువు, ఎత్తు, తీసుకునే ఆహారంపై తరుచూ వార్తలు, చర్చలు జరుగుతుండేవి. రోజూ ఐదు లీటర్ల పాలు, రెండున్న లీటర్ల జ్యూస్, ఒక కోడి, కేజీ మటన్, ఒక కేజీ బాదం పప్పు, రెండు ప్లేట్ల బిర్యానీ, మూడు లీటర్ల సూప్ తీసుకునేవారు. 6 గంటల వ్యాయామం, 9 గంటలు నిద్ర పోయేవారని అప్పటి వార్తా పత్రికల ద్వారా తెలుస్తున్నది. ఎత్తు 5.3 అడుగులు, బరువు 107 కేజీలు ఉండేవారట. 6 గంటల వ్యాయామం అనంతరం 9 గంటలు నిద్రపోయేవారట.
1950-54 మధ్యకాలంలో హమీదాబానో కెరీర్ పతాకస్థాయికి చేరింది. తాను పాల్గొన్న 320 పోటీల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదని హమీదాబానో అప్పట్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె ఆటను చూడటానికి పాత కాలంలో గ్రీకు దేశంలో జరిగే ఆటలను పోలేలా ఏర్పాటు ఉండేవి. చుట్టూ జనం కూర్చొనేలా ఏర్పాట్లు చేసేవారు. లాహోర్ లో జరిగిన పోటీలో బాబా పహిల్వాన్ తో ఆమె తలపడ్డారు. అప్పటికే ఆయనను హమీదా బానానోను ఓడించి పెళ్లి చేసుకుంటానని ప్రగల్బాలు పలికారు. కానీ, ఆ మ్యాచ్ కేవలం ఒకటిన్న నిమిషాల్లోనే పూర్తయింది. ఆమె అశేషంగా పరాక్రమాన్ని హాజరైన ప్రజలు చూడలేకపోయారు.
అప్పటి వార్తా పత్రికలు హమీదాబాను పోరాట పటిమను కీర్తిస్తుంటే, అదే స్థాయిలో ఉన్న అజ్ఞానం, పురుషాధిక్యత మహిళా మల్లయోధులను అంగీకరించడానికి లేదా వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఇష్టపడని మనస్తత్వాన్ని సూచిస్తుంది. బాను కుస్తీ రంగంలోకి ప్రవేశించడం క్రీడా ప్రోత్సాహం కంటే, లింగం, మతపరమైన ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. ముఖ్యమైన సామాజిక మార్పును కూడా ఇప్పటికీ అప్రతిహాతంగా కీర్తించకబడకపోవడం విచారకరం.
ఒక మహిళను పురుషులకు సవాల్ విసరడం, వారిని చిత్తుగా ఓడించడం చాలా మందికి నచ్చేది కాదు. అప్పట్లో పుణేకు చెందిన నేషనల్ ట్రైనింగ్ అసోసియేషన్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన శోభా సింగ్ పంజాబీకి కూడా ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి. మగ రెజర్లను ఓడించిన తరువాత ఆమె రాళ్లు రువ్వారు. ‘‘నేషనల్ ఎట్ ప్లే హిస్టరీ ఆఫ్ స్పోర్ట్ ఇన్ ఇండియా’’ పుస్తకంలో ఈ విషయాలన ప్రస్తావించరు. అప్పట్లో క్రీడా వినోదం ఉండేది. హమీదా బానోతో కుస్తీలు పోటీలు నిర్వహించాలని భావించారు. వీరిలో అంథ రెజ్లర్ కూడా ఉన్నారు. ఇతనికి పన్ను నొప్పి కారణంగా రాకపోవడంతో బానోను విజేతగా ప్రకటించారు. ఆ తరువాత కుస్తీ పోటీలపై నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలని ఆమె బాబే ముఖ్యమంత్రి మొరార్జీదేశాయ్ ను కూడా కలిశారట.
బాను తిరస్కరణ కేవలం స్త్రీ నైతికత గురించిన సంప్రదాయ భావనల నుంచే కాకుండా, పురుషుల కంటే మెరుగ్గా పోరాడటం జీర్ణించుకోలేని దుర్బలమైన పురుషాధిక్య వైఖరి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఆమె వ్యక్తిగత జీవితం గురించిన వివరాలను కనుగొనే ఏ ప్రయత్నం చేసినా ఆమె కుస్తీ పోరాటం ముందు తేలిపోతుంది. “అమెజాన్ ఆఫ్ అలీఘర్” పిలవబడే ఆమెను పిలిచేవారు. అమెరికా ప్రముఖ రెజర్లలో అమెజాన్ ఒకరు. ‘‘వీరు మహిళలు ఎవరూ ఢీ కొట్టలేరు. మగవారిపైనా సవాల్ విసిరేవారు’’ అని ఒక రచయిత రాసుకొచ్చారు. అనేక సామాజిక అణచివేతలు ఉన్నప్పటికీ, ఆమె తన కుస్తీ ప్రయాణాన్ని కొనసాగించినందుకు ప్రశంసించాల్సిందే. హమీదా బాను ఎక్కువగా మగ రెజ్లర్లతో పోటీ పడేది. అతి తక్కువ సమయంలోనే మట్టి కరిపించేంది. దీనిని జీర్ణించుకోలేని ఆమె ప్రత్యర్థుల పక్షపాతాలు, అవమానాలకు గురి చేసేవారు. అసభ్యకరంగా మాట్లాడుకునేవారు.
రష్యా రెజ్లర్ వీర చెస్టెలిన్ ను కూడా 1954లో జరిగిన మ్యాచ్ లో హమీదాబానో ఓడించారట. ఆ తరువాత యూరప్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. రికార్డుల నుంచి ఆమె అప్రతిహత రికార్డులు కనుమరుగయ్యాయి. కెరీర్ ను అథమ స్థానానికి చేర్చడంలో చాలా మంది చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి.
యూరప్ వెళ్లేందుకు ఇష్టం లేని బానో ట్రైనర్ సలాం ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆమె చేయి, కాలు విరిగినట్లు సౌది అరేబియాలో జీవిస్తున్న బానో మనవడు ఫిరోజ్ షేక్ తెలిపారు. బానోను సలాం పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె మెడల్స్ మొత్తం సలాం అమ్ముకున్నాడని ఆమె మనవడు అన్నారు. చివరి రోజుల్లో బూందీ అమ్ముకొని బానో జీవించడం విషాదంత అంశంగా మిగిలిపోయింది. ఆమె వ్యక్తిగత జీవితంపై నెలకొన్న భిన్న వాదనలు పక్కనపెడితే, ఎవరూ ఆమెను ఓడించలేకపోయారనే విషయం చరిత్రలోనే మిగిలిపోయింది.