https://oktelugu.com/

Custody Movie Sequel: ‘కస్టడీ 2 ‘ కి ముహూర్తం సిద్ధం.. ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఏంటి సామీ!

నాగ చైతన్య నుండి దీనికి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.ఒకవేళ ఒప్పుకొని విక్రమ్ కె కుమార్ అనుకున్నట్టుగా రెండవ భాగానికి హైప్ రప్పించి సూపర్ హిట్ చెయ్యగలిగితే మాత్రం చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.ఇక కస్టడీ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే, ఈరోజుకు ఈ చిత్రం విడుదలై 5 రోజులు పూర్తి చేసుకొని ఆరవ రోజులోకి అడుగుపెట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 17, 2023 / 01:16 PM IST

    Custody Movie Sequel

    Follow us on

    Custody Movie Sequel: టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ చాలా కాలం నుండే ఉంది. హిట్ అయినా సినిమాలకు సీక్వెల్స్ తియ్యడం అనేది సర్వసాధారణం, కానీ అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా సీక్వెల్స్ తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అనే చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, వెంటనే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే చిత్రాన్ని తీసాడు, ఇది కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

    ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఈ ఏడాదిలోనే భారీ లెవెల్ లో విడుదలైన ‘కబ్జా’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా దానికి సీక్వెల్ త్వరలోనే తియ్యబోతున్నారు. ఇప్పుడు మన అక్కినేని నాగ చైతన్య రీసెంట్ డిజాస్టర్ చిత్రం ‘కస్టడీ’ కి కూడా త్వరలోనే సీక్వెల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వెంకట్ ప్రభు దగ్గర కొనసాగింపుకు ఒక అద్భుతమైన పాయింట్ ఉందని, మొదటి భాగం ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా రెండవ భాగం ప్రమోషనల్ కంటెంట్ నుండే భారీ హైప్ తెచ్చే విధంగా ప్లాన్ చేస్తానని వెంకట్ ప్రభు నాగ చైతన్య తో అన్నాడట.

    నాగ చైతన్య నుండి దీనికి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.ఒకవేళ ఒప్పుకొని విక్రమ్ కె కుమార్ అనుకున్నట్టుగా రెండవ భాగానికి హైప్ రప్పించి సూపర్ హిట్ చెయ్యగలిగితే మాత్రం చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.ఇక కస్టడీ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే, ఈరోజుకు ఈ చిత్రం విడుదలై 5 రోజులు పూర్తి చేసుకొని ఆరవ రోజులోకి అడుగుపెట్టింది.

    ఈ 5 రోజులకు గాను ఈ చిత్రం దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. కలెక్షన్స్ పెద్దగా రాకపోయినా వర్కింగ్ డేస్ లో స్టడీ వసూళ్లను మైంటైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.నాల్గవ రోజు 40 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , 5 వ రోజు 37 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరగగా, ఫుల్ రన్ లో 10 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.