Tiger Nageswara Rao Run Time : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో అరగంట కోత.. ఇప్పుడు వర్కవుట్ అవుతుందా?

మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. టైగర్ నాగేశ్వరరావు ఒకప్పటి గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కింది.

Written By: NARESH, Updated On : October 22, 2023 8:40 am
Follow us on

Tiger Nageswara Rao Run Time : టైగర్ నాగేశ్వరరావు మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రధాన కంప్లైంట్ నిడివి. దాదాపు మూడు గంటల నిడివితో సినిమా విడుదల చేశారు. విడుదలకు ముందు నుండి సినిమా లెంగ్త్ పై అనుమానాలు ఉన్నాయి. సినిమా ఫలితాన్ని అదే దెబ్బ తీసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలకు పాల్పడ్డారు. దర్శకుడు వంశీ కృష్ణ టైగర్ నాగేశ్వరరావు తన డ్రీం ప్రాజెక్ట్ అన్నాడు. టైగర్ నాగేశ్వరరావు జీవితం వెండితెరపై ఆవిష్కరించడంలో వంశీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

అయితే బడ్జెట్ పరిమితుల రీత్యా విఎఫ్ఎక్స్ క్వాలిటీగా ఇవ్వలేదు. దాని వలన ట్రైన్ రాబరీ సీన్ లో విషయం ఉన్నా నాసిరకం గ్రాఫిక్స్ వలన తేలిపోయింది. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ బాగా తీశాడు. టైగర్ నాగేశ్వరరావు పాత్రను పరిచయం చేసిన తీరు యాక్షన్ సీన్స్, ఒకప్పటి స్టూవర్టుపురం దొంగల జీవన విధానం, ఆ కాలం నాటి దొంగల ముఠాలు వంటి విషయాలు ఆకట్టుకునేలా చూపించాడు.

సెకండ్ హాఫ్ లోనే వంశీ తడబడ్డాడు. సినిమా నిడివి పెరిగి సాగతీతకు గురైంది. దాంతో ప్రేక్షకులు రేసీ స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేయలేకపోయారు. అధికారికంగా టైగర్ నాగేశ్వరరావు చిత్ర నిడివి 2:52 నిమిషాలుగా ప్రకటించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ అంత నిడివి అంటే రిస్క్ అన్నారు. ఈ విషయంలో దర్శకుడు వంశీని కొందరు హెచ్చరించారట కూడా. నిడివి తగ్గిస్తే బెటర్. రిస్క్ అవుతుందని చెప్పారట.

తన కథ, మేకింగ్ మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వంశీ అందుకు ససేమిరా అన్నాడట. సినిమా రిజల్ట్ తర్వాత దిగిరాక తప్పలేదు. దాదాపు 20 నిమిషాలకు పైగా నిడివి తగ్గించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నుండి కొన్ని సన్నివేశాలు ఎత్తేశారు. 2:37 నిమిషాలతో కొత్త ఎడిటింగ్ వెర్షన్ విడుదల చేసినట్లు ప్రకటించారు. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. టైగర్ నాగేశ్వరరావు ఒకప్పటి గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కింది.