Gurthunda Seethakalam Movie Review : నటీనటులు : సత్య దేవ్ , తమన్నా , మేఘ ఆకాష్ , కావ్య శెట్టి,సుహాసిని
దర్శకుడు : నాగశేఖర్
నిర్మాత : రామారావు చింతపల్లి
మ్యూజిక్ : కాళ భైరవ
డీఓపీ : సత్యా హెగ్డే
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
స్టోరీ : డార్లింగ్ కృష్ణ

విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న యువ నటులలో ఒకరు సత్యదేవ్..క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ తో కెరీర్ ని ప్రారంభించిన సత్య దేవ్..ఆ తర్వాత తన ప్రతిభ తో మెయిన్ హీరో పాత్రలు చేసుకునే రేంజ్ కి ఎదిగాడు..యూత్ ఆడియన్స్ లో మంచి నటుడిగా సత్యదేవ్ కి ఒక గుర్తింపు ఉంది..ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించాడు..ఇందులో ఆయన పోషించిన విలన్ పాత్ర చిరంజీవి తో నువ్వా నేనా అనే రేంజ్ లో ఢీ కొట్టే విధంగా ఉంటుంది..అలాగే హిందీ లో రీసెంట్ గా ఆయన అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన ‘రామ్ సేతు’ అనే సినిమా లో కూడా తన అద్భుతమైన నటనని కనబర్చాడు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో హీరో గా మన ముందుకి వచ్చాడు..కన్నడలో సూపర్ హిట్ గా నిలిచినా లవ్ మాక్ టైల్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు ఆడియన్స్ ని అలరినిచ్చిందో లేదో ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
హీరో సత్యదేవ్ ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు..ఒక రోజు ఆయన ట్రిప్ కి వెళ్తున్నప్పుడు దారిలో అదితి అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం గమనించి ఆమె ప్రాణాలను కాపాడి తన కారులో ఇంటికి సురక్షితంగా చేరుస్తాడు..ఈ కార్ జర్నీ లో అదితి సత్య దేవ్ ని ‘మీ జీవితం లో కూడా ప్రేమ ఉందా..ఉంటే చెప్పండి’ అని అడుగుతుంది..అప్పుడు సత్యదేవ్ తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం ప్రారంభిస్తాడు..ఆయన చదువుకుంటున్న స్కూల్ డేస్ నుండి ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేది..కానీ ఆ అమ్మాయి తన తల్లిదండ్రులది ఫెయిల్యూర్ మ్యారేజ్ అని ..తాను కూడా అలా అవ్వాలనుకోవడం లేదని ప్రేమకి దూరంగా ఉంటుంది..ఇక హీరో పెరిగి పెద్దయ్యాక ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ లో మంచి రిచ్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు..ఆ అమ్మాయి కూడా తిరిగి ప్రేమిస్తుంది కానీ సత్యదేవ్ బ్యాక్ గ్రౌండ్ మీద..అతను తనని జీవితాంతం పోషించగలడా లేదా అని అనుమానం పడుతుంది..ఆ అమ్మాయి అనుమానాలు అన్ని తీర్చడం కోసం సత్యదేవ్ ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం సంపాదిస్తాడు..అయినా కూడా ఆ అమ్మాయి తన పేరెంట్స్ ఒత్తిడి కారణం గా హీరో కి బ్రేకప్ చెప్పేస్తుంది..ఆ తర్వాత ఏమి జరిగింది..వీలిఇద్దరు మళ్ళీ కలుస్తారా..లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
లవ్ స్టోరీస్ ఈమధ్య కాలం లో కాస్త డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు..లేదంటే ఎంత ఫీల్ గుడ్ లవ్ ఉన్నా థియేటర్స్ లో నిలబడడం లేదు..గుర్తుందా శీతాకాలం చిత్రం కూడా అలాంటిదే..సత్యదేవ్ మరియు తమన్నా తమ పాత్రలకు న్యాయం చేసారు..వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఉంది..స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ గా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ నాగశేఖర్..ఇక సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది..కానీ కథలో కొత్తదనం లేకపోవడమే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ వైపు రప్పిస్తుందా లేదా అనే అనుమానం కలిగించేలా చేస్తుంది..ఇక కాల భైరవ అందించిన సంగీతం కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది..ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చొచ్చు కానీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడం కష్టమే.
చివరి మాట :
ఫీల్ గుడ్ మూవీ లవర్స్ కి మాత్రమే నచ్చే సినిమా..ఒకసారి తప్పకుండ చూడొచ్చు
రేటింగ్ : 2.5/5