Pawan Kalyan : ‘మనకెందుకు రా ఈ రాజకీయాలు అంటే మా తమ్ముడు ఒప్పుకోలేదు. హాయిగా ఉన్న జీవితాన్ని ప్రజల కోసం పణంగా పెట్టాడు. విపరీతమైన స్టార్ డమ్ ను వదులుకొని ప్రజల కోసం మాటలు కాస్తున్నాడు’ అప్పుడెప్పుడో స్టాటింగ్ లో పవన్ ను ఉద్దేశించి ఆయన సోదరుడు నాగబాబు ఆవేదనతో చేసిన కామెంట్స్ ఇవి. కుటుంబసభ్యుడిగా నాగబాబు ఆవేదనలో ముమ్మాటికీ అర్ధముంది. అసలు పవన్ పొలిటికల్ ఎంట్రీ నుంచే ఆయనపై ఒకరకమైన భౌతిక దాడి జరుగుతోంది. ఆయన మానసిక స్థైర్యంపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత హననానికి పాల్పడుతూ వస్తున్నారు. ఆయన సినిమాలకు అడ్డుతగులుతారు. ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బకొడతారు. ఆయనపై కోపంతో సినీ పరిశ్రమపై రివేంజ్ తీర్చుకుంటారు. అదే సినీ మనుషులతో ఆయన్ను తిట్టిస్తారు. చివరకు పవన్ కూర్చున్నా.. నిలుచున్నా.. చివరికి ఒంటిపై వేసుకున్న వస్త్రాన్ని వదలరు. ఆయన చదువువుతున్న పుస్తకాన్ని హేళన చేసి మాట్లాడతారు. ఆయన అవసరాల కోసం కొనుగోలు చేసుకున్న వాహనాలకు ఏవేవో రూపాలను అండగడతారు. అయితే వీటన్నింటికీ ఒకటే కారణం. తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఎక్కడ గండికొడతాడోనన్న భయం మాటున వచ్చే వికృత చేష్టల ఇవి.

గత మూడున్నరేళ్లుగా తరచూ పవన్ ను ఉద్దేశించి అధికార పార్టీ చేసే ఆరోపణ ‘మూడు పెళ్లిళ్లు’. దీనిపై పవన్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నాయకుల వరకూ పవన్ వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేలా మాట్లాడారు. చివరకు మూడు రాజధానుల అంశాన్ని కూడా పవన్ మూడు పెళ్లిల్లతో పోల్చి మరీ దిగజారుడు రాజకీయాలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని పవన్ పర్సనల్ లైఫ్ ను సైతం డ్యామేజీ చేసే ప్రయత్నం చేశారు. దానినే పొలిటికల్ వెపన్ చేసుకోవాలని చూశారు. పవన్ వద్దు వద్దూ అని అభ్యర్థించారు. పర్సనల్ కామెంట్స్ వద్దని విన్నవించారు. విధానపరంగా పోరాడుకుందామని చెప్పినా వినలేదు. అదే పనిగా.. అదే పద్ధతిలో వ్యక్తిగత కామెంట్స్ కు మరింత పదును పెట్టారు. దాని పర్యవసానమే పవన్ చెప్పుచూపి హెచ్చరించడం.
ప్యాకేజీ నాయకుడు, పావలా నాయకుడు అంటూ పలుచన చేసే ప్రయత్నం చేశారు. సినిమాలు చేసుకుంటూ.. ప్యాకేజీ తీసుకొని విమర్శలు చేస్తున్నాడంటూ గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. అయితే అందులో వాస్తవం లేదన్నది ప్రజలకు తెలుసు. 2014 ఎన్నికల్లో క్లీయర్ కట్ గా రాష్ట్ర అవసరాల కోసం ఎన్డీఏకు మద్దతు తెలిపారు. 2019లో ఒంటరిగా పోటీచేశారు. వైసీపీ విజయానికి ఒక కారణమయ్యారు. ప్యాకేజీ తీసుకుంటే వైసీపీ నుంచే తీసుకోవాలి. కానీ అదేవైసీపీ నాయకులు టీడీపీ, బీజేపీ నుంచి ప్యాకేజీ తీసుకుంటున్నారని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ ను మరింత డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ప్రచారాన్ని మరింత పదును పెట్టారు. దాని పర్యవసానమే పవన్ రియాక్టుకు కారణం. పవన్ చెప్పుచూపి మరీ హెచ్చరించడానికి కారణం, తనసంపాదనను, తన ఖర్చును, చివరకు ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో చెల్లించినది గణాంకాలతో చెప్పడానికి అదే రీజన్.
పొత్తలనేవి రాజకీయ పార్టీల వ్యూహాల్లో భాగంగా. కొన్ని పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగి ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల వ్యూహంలో భాగంగా అనూహ్యంగా కలుస్తాయి. మరికొన్ని స్నేహంగా ఉన్నా విడివిడిగా పోటీచేస్తాయి. ఆయా పార్టీల సైద్ధాంతికత, భావసారుప్యత, అవసరాలు మేరకు పొత్తులు కుదురుతాయి. కానీ వైసీపీ నాయకులు పదే పదే జనసేన పొత్తుల గురించే మాట్లాడతారు. ఒంటరి పోరుకురావాలని పిలుపునిస్తారు. 175 నియోజకవర్గాల్లో పోటీచేయాలని సవాల్ విసురుతారు. ఎవరితో కలుస్తారో? ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారో? అది వారిష్టం. ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. సీఎం నుంచి చోటా నాయకుడి వరకూ అవే సవాళ్లు. అవే మాటలు. మరి అదే పవన్ మీరెవరితో నడుస్తారు? అని అడగడం లేదు కదా. మేము ఒంటరిగా వస్తామనే చెబుతున్నారు. కానీ మీతో ఎవరు కలవరని మాత్రం చెప్పలేకపోతున్నారు. పలానా వారితో మీరు కలిసిరండి అని పవన్ చెబితే మీరు పొత్తు పెట్టుకోగలరా? ఎవరిష్టం వారిది. ఎవరి వ్యూహాలు వారివి. అయినా పవన్ ఎవరితో కలిస్తే మీకేంటి? ఎవరితో ఉంటే మీకేంటి? ఎంతమంది కలిసినా అవే ఓట్లు కదా? ఎదుటి పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి ప్రయోజనం పొందుతామన్న ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మీకు వ్యతిరేకంగా ఉన్న పవన్ ఏది చేసినా వారికి తప్పుగానే కనిపిస్తోంది. వ్యతిరేకించక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది.