Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసు బీజేపీకి మాయని మచ్చ

బిల్కిస్ బానో కేసు బీజేపీకి మాయని మచ్చ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: NARESH, Updated On : January 9, 2024 6:02 pm

Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసు.. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రాజకీయాలు ఇలాంటి విషయాల్లో రాకూడదు. ఆవిడ చేసిన తప్పేంటి? ఎవరో గోద్రా టైన్ లో కరసేవకులు కాల్చిన వారు వేరు.. ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇంత మంది రేప్ చేసి.. ఆమె కుటుంబాన్ని చంపేస్తే.. న్యాయం కోసం ఆమె అర్థించడం తప్పు ఎలా అవుతుంది. ? శిక్ష పడిన నిందితులకు క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఇక్కడ కూడా హిందువులు, ముస్లింలు అని చూస్తామా? నేరం చేసిన వాడు నేరస్థుడే.. వాడు ఏ ప్రాంతం, మతం వాడు అయినా సరే ఊపేక్షించవద్దు. నేరస్థుడు ఎక్కడున్నా నేరస్థుడే..

ఆవిడకు జరిగింది మామూలు నేరం కాదు. ఆ నిందితులకు ఎందుకు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది? ఇదే విమర్శలకు తావిచ్చింది. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులను బట్టి చేశామనడం కరెక్ట్ కాదు.. మీరు ఇటువంటి జరిగినవి దానిమీద కఠిన శిక్షలు వేయాలని చెబుతారు. బీజేపీ మోరల్ నీతి మీద చాలా మాట్లాడుతోంది కదా.. 10 మంది వేసిన సమీక్ష కమిటీలో ఐదుగురు బీజేపీ వాళ్లే..

బీజేపీ వాళ్లకు జ్ఞానం ఎటుపోయింది.. ఎలా క్షమాభిక్ష పెట్టడం.. వారికి దండలు వేసి సన్మానం చేయడం.. వారికి స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవడం మానవత్వానికి మాయని మచ్చ.

నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు అద్భుతమైన తీర్పు. బాధితురాలి కన్నీళ్లు తుడిచిన తీర్పు. ఇది వ్యవస్థల మీద నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చిన తీర్పు.

బిల్కిస్ బానో కేసు బీజేపీకి మాయని మచ్చ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు