Train Journey: మనలో చాలా మంది దూరభారం ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కువగా ట్రైన్స్ లో జర్నీ చేయడానికే మొగ్గు చూపుతుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ రైళ్లలో చాలా మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది రిజర్వేషన్లు చేసుకోగా మరికొందరు జనరల్ బోగీల్లో వస్తుంటారు. సులువుగా, సౌకర్యవంతంగా వెళ్లేందుకు ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తారు.
రైల్వేస్ సంస్థ తమ ప్రయాణికుల కోసం చాలా సౌకర్యాలను కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే రైలు ప్రయాణాలు చూసే మీరు మూడు నంబర్లను తప్పక తెలుసుకోవాలి. అవి ఏంటి? ఎందుకు ఉపయోగపడతాయి… అనే విషయాలను మనం తెలుసుకుందాం.
ముందుగా ‘ 8750001323 ’.. ఈ నంబర్ సహయంతో మనం ట్రైన్ లో ఉండే నచ్చిన రెస్టారెంట్ నుంచి కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ డైరెక్ట్ గా మన సీటు వద్దకే వస్తుంది. ఈ నంబర్ అనేది ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ వాళ్లకి సంబంధించింది. ఈ నంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని మేసేజ్ చేయాలి.వెంటనే మనకు వచ్చే లింక్ ను ఓపెన్ చేయగానే వేరే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ పీఎన్ఆర్ నంబర్ ను ఎంటర్ చేయాలి.. ఈ క్రమంలో నెక్ట్స్ స్టేషన్ కు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లను చూపిస్తుంది. సదరు రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. స్టేషన్ రాగానే మీరు ఆర్డర్ చేసిన పుడ్ ను మీ సీట్ వద్దకు తీసుకువచ్చి ఇస్తారు.
తరువాత.. 9881193322.. ఈ నంబర్ ను మీ మొబైల్ లో సేవ్ చేసుకుని వాట్సాప్ లో పిఎన్ఆర్ నంబర్ పంపండి. వెంటనే టికెట్ స్టేటస్ ను చూపిస్తుంది. వెయిటింగ్ లిస్టు టికెట్ ను బుక్ చేసుకున్న ప్రయాణికులు అయితే బుక్ చేసుకున్న నంబర్ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆర్ఏసీ నంబర్.. ఆర్ఏసీ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.టికెట్ కన్ఫామ్ అయిందా? లేదా? టికెట్ స్టేటస్ ఏంటి ? అనేది అన్ని వివరాలను మనం మన మొబైల్ లోనే చూసుకోవచ్చు.
ఇక నంబర్ -139.. ఇది రైల్వే మదత్ నంబర్. నార్మల్ గా రైలు ప్రయాణాలు చేసే సమయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులకు కానీ ఎవరికైనా అనుకోకుండా హెల్త్ బాలేకపోతే ఎమర్జెన్సీ సమయాల్లో ఈ నంబర్ కు కాల్ చేయాలి..నెక్ట్ స్టేషన్ లో బాధితుల కోసం మెడికల్ సిబ్బంది రెడీగా ఉంటారు. అత్యవసర చికిత్సను అందిస్తారు.
మీరు కూడా ఈ మూడు నంబర్లను సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం అయిన సమయంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కు తెలపండి..