Geeta Singh: ఇండస్ట్రీలో స్టార్స్ కే లైఫ్ ఉంటుంది. ఓ మోస్తరు నటులు అటూ ఇటు కాకుండా పోతారు. అవకాశాలు ఆగిపోతే లైఫ్ తలక్రిందులు అవుతుంది. పరిశ్రమలో ఏళ్ల తరబడి ఉన్న నటులు కూడా చివరి రోజుల్లో దుర్భర జీవితాలు అనుభవించారు. అనేక మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్స్, విలన్స్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. కితకితలు ఫేమ్ గీతా సింగ్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది. పరిశ్రమలో ఆఫర్స్ తగ్గడంతో ఆమె జీవితం ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో సంపాదించిన కొంచెం డబ్బులు కూడా బంధువులు, స్నేహితుల కారణంగా పోగొట్టుకొని సాదాసీదా జీవనం సాగిస్తుంది.

తాజాగా గీతా సింగ్ తన ఆవేదన తెలియాజేశారు. ఈ మధ్య సినిమా అవకాశాలు రావడం లేదు. ఫిమేల్ ఆర్టిస్స్ ని ఎవరు తీసుకోవడం లేదు. మేల్ ఆర్టిస్ట్స్ కి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. అందులోనూ నాకు పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేదు. కుటుంబ సభ్యులకు కూడా డబ్బులు అవసరమైతేనే నేను గుర్తుకు వస్తాను. బంధువులు, స్నేహితులను నమ్మి ఆర్థికంగా నష్టపోయాను.
సొంత చెల్లెలు సైతం నన్ను మోసం చేసింది. అలాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నమ్మి రూ. 6 కోట్ల వరకు నష్టపోయాను. సినిమాలతో సంపాదించిన డబ్బులన్నీ చిట్టీలు కట్టాను. నా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. ఉన్నదంతా పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఆ దశలో చనిపోవాలి అనుకున్నాను. రెండు సార్లు సూసైడ్ ప్రయత్నం చేశాను. నా స్నేహితురాలు నన్ను కాపాడింది. ఆమె సపోర్ట్ ఇచ్చింది. ఫ్రెండ్ కారణంగానే నేను బ్రతికి ఉన్నాను. నా బాగోగులు స్నేహితురాలే చూసుకుంటుంది.

అలాగే ఆమె అన్నయ్య పిల్లలను దత్తత తీసుకొని పెంచుతున్నాను, అని గీతా సింగ్ తెలియజేసింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్స్ లో గీతా సింగ్ నటించారు. ఎవడి గోల వాడిది చిత్రం గీతా సింగ్ కి ఫేమ్ తెచ్చింది. ఈవీవీ తెరకెక్కించిన కితకితలు మూవీలో గీతా సింగ్ నరేష్ కి హీరోయిన్ గా నటించడం విశేషం. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 50 చిత్రాల్లో లేడీ కమెడియన్ గా గీత నటించారు. గుడ్డిగా కొందరిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్నారు.