https://oktelugu.com/

రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో రేషన్ ఏటీఎంలు..?

దేశంలోని కోట్ల సంఖ్యలో కుటుంబాలు రేషన్ కార్డును కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డును కలిగి ఉన్న వాళ్ల కోసం త్వరలో రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి రాబోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ ఏటీఎంల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుల కింద రేషన్ ఏటీఎంల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. Also Read: కారు కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్షన్నర రూపాయల తగ్గింపు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 23, 2021 / 11:59 AM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో కుటుంబాలు రేషన్ కార్డును కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డును కలిగి ఉన్న వాళ్ల కోసం త్వరలో రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి రాబోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ ఏటీఎంల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుల కింద రేషన్ ఏటీఎంల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది.

    Also Read: కారు కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్షన్నర రూపాయల తగ్గింపు..?

    రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, మహరాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలలో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుల కింద రేషన్ ఏటీఎంల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. త్వరలో ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో కూడా రేషన్ ఏటీఎంల పైలెట్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

    Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. మళ్లీ ఖాతాల్లో రూ.2000..?

    ఈ ప్రాజెక్ట్ ప్రకారం రేషన్ మెషీన్లలో బయోమెట్రిక్స్ వేయడం ద్వారా సులభంగా రేషన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. 24 గంటలు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. కేవలం 120 సెకన్లలో ఈ రేషన్ ఏటీఎం ద్వారా 25 కిలోల గోధుమలను పొందవచ్చని సమాచారం. ఇలా మిషన్ల ద్వారా రేషన్ తీసుకునే వారికి అధికారులు స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తారు. రేషన్ ఏటీఎంల వల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం చేకూరనుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    రేషన్ ఏటీఎంల ద్వారా సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. రేషన్ ఏటీఎంల ద్వారా సరుకులు పంపిణీ చేయడం గురించి ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.