https://oktelugu.com/

మున్సిపల్‌ పోరు.. రాజకీయాల్లో మార్పులు..

ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ పోరు ముగిసింది. ఇక మున్సిపల్‌ ఫైట్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో తామే ఎక్కువ సీట్లు సాధించామంటే.. లేదు తామకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ బలప్రదర్శన చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 14న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలన్నీ గెలుపు తమదంటే తమదని ప్రకటించుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. ఎవరి అనుకూల మీడియాలో వారికి అందలం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 / 11:58 AM IST
    Follow us on


    ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ పోరు ముగిసింది. ఇక మున్సిపల్‌ ఫైట్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో తామే ఎక్కువ సీట్లు సాధించామంటే.. లేదు తామకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ బలప్రదర్శన చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 14న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలన్నీ గెలుపు తమదంటే తమదని ప్రకటించుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. ఎవరి అనుకూల మీడియాలో వారికి అందలం దక్కింది. కానీ అసలు మ్యాటర్ ఏంటో మాత్రం ప్రజలకు అర్థం కాలేదు.

    Also Read: నేడు ఏపీ కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాల దిశగా జగన్

    ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చాయనేది ప్రజలకైతే ఇంకా క్లారిటీ లేదు. దీనికి కారణం పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగడమే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీల ప్రకారమే జరుగుతాయి. పార్టీల గుర్తుల ప్రకారమే జరుగుతాయి. పార్టీల అభ్యర్థులు ఉంటారు. ఫలితాలను కూడా పార్టీ పరంగానే ధృవీకరిస్తారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను మ్యానిప్యూలేట్ చేయడానికి అవకాశం ఉండదు.

    మొత్తంగా ఏపీలో 75 మున్సిపాలిటీలు.. నగర పంచాయతీలు.. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఓ రకంగా ఇది మినీ అసెంబ్లీ ఫైట్ అనక తప్పదు. ప్రతి కీలక నియోజకవర్గంలోనూ ఓ మున్సిపాలిటీ ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కార్పొరేషన్ ఉంది. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చు. పైగా.. గ్రామాలతో పోలిస్తే ఇక్కడ లోకలైజేషన్ మరీ అంత తీవ్రంగా ఉండదు. ప్రజల ఓట్ల ప్రయారిటీకి స్థానిక సమస్యలతోపాటు ప్రభుత్వ విధానాలు కూడా కారణంగా మారే అవకాశం ఉంది. అందుకే.. ప్రజల తీర్పుపై ఆసక్తి ఏర్పడింది.

    Also Read: కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే..: ఏపీలో ప్రతిపక్షాల డిమాండ్‌

    మొత్తం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామని అధికార పార్టీ ధీమాతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయంతో పోలిస్తే.. కైవసం చేసుకోవాల్సిందే కూడా. అలా కాకుండా కొన్ని సీట్లు కోల్పోయినా ప్రతిపక్షం పుంజుకుందనే భావన రాక తప్పదు. అంటే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందనే అభిప్రాయం వస్తుందన్నమాట. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు పెను సవాల్. తాము బలంగా ఉన్నామని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలక పాత్ర పోషించనున్నాయి. లేకపోతే..గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్