https://oktelugu.com/

కోటి మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయనుందని సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి వివిధ దేశాల నేతల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కేంద్రం మరింత మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేయనుందని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 1, 2021 11:19 am
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయనుందని సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి వివిధ దేశాల నేతల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కేంద్రం మరింత మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది.

    రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనుంది. అతి తక్కువ డాక్యుమెంట్లతో ఈ గ్యాస్ సిలిండర్లను పొందవచ్చని సమాచారం. 2021 – 22 బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి ఫ్రీ గ్రాస్ సిలిండర్ల ప్రస్తావన తెచ్చారు.

    అయితే బడ్జెట్ లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు కేంద్రం రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. తరుణ్ కపూర్ బడ్జెట్ లో కేటాయించకపోవడం గురించి మాట్లాడుతూ సబ్సీడీ ద్వారా ఒక్కో కనెక్షన్ కోసం ఖర్చయ్యే 1,600 రూపాయల మొత్తాన్ని పూడ్చుకోవచ్చని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఏకంగా 8 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని తరుణ్ కపూర్ అన్నారు.

    తరచుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లకు ఉచిత గ్యాస్ సిలిండర్ లభించే విధంగా నిబంధనలలో మార్పులు చేశామని చెప్పారు. మూడు కంపెనీలతో ఐటీ బేస్డ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళ్లేవాళ్లకు ఎల్పీజీ కనెక్షన్లు దొరికేలా సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.సమీపంలోని గ్యాస్ డీలర్ ను సంప్రదించి ఈ స్కీమ్ ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.