https://oktelugu.com/

ఏపీలో ‘పుర’పోరుపై వైసీపీ దృష్టి…

ఏపీలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అంతటా ప్రశాంతంగానే జరిగినా.. అక్కడక్కడా జరిగిన సంఘటనలు కొంత ఆందోళన కలిగించాయి. ఎస్ఈసీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. పార్టీ గుర్తుమీద జరిగే ఎన్నికలు కావడంతో వైసీపీ ఇక్కడ తన బలాన్ని నిరూపించుకోవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అత్యవసరం. రెండేళ్ల తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి […]

Written By: , Updated On : March 1, 2021 / 11:10 AM IST
Follow us on

AP municipal elections
ఏపీలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అంతటా ప్రశాంతంగానే జరిగినా.. అక్కడక్కడా జరిగిన సంఘటనలు కొంత ఆందోళన కలిగించాయి. ఎస్ఈసీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. పార్టీ గుర్తుమీద జరిగే ఎన్నికలు కావడంతో వైసీపీ ఇక్కడ తన బలాన్ని నిరూపించుకోవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అత్యవసరం. రెండేళ్ల తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఆధారం. అందుకోసమే వైసీపీ ఈ ఎన్నికల్లో సత్తాచాటాల్సిన అవసరం ఉంది.

Also Read: షర్మిలకు భయపడుతున్న పవన్.. కారణం ఇదేనా..?

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అలా ఉండదు. అధికారంలో ఉండడంతో సహజంగానే వైసీపీకి మున్సిపల్ ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. కానీ రెండేళ్ల పాలనో జగన్ పట్టణాలపై చూడలేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కానీ.. అభివృద్ధిని పట్టించుకోలేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా విడుదల చేయకపోవడంతో పట్టణ ప్రాంత ఓటర్ల నాడీ ఎలా ఉంటుందో చెప్పలేం.

ఏపీలో 75 మున్సిపాలిటీలు.. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా ఈ బాధ్యతలను వైసీపీ అధినేత జగన్ మంత్రులకు అప్పగించారు. మున్సిపాలిటీల వారీగా మంత్రులు ప్రచార బాధ్యతలు చూసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు.

Also Read: ‘గులాబీ’ నేతల్లో కొత్తపార్టీ గుబులు

పట్టణ ప్రాంతాలోల టీడీపీ కొంత బలహీనంగా ఉండడం వైసీపీకి కొంత కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేసి ఉండడం.. ఆర్థికంగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనడంతో టీడీపీకి అనేకచోట్ల మేయర్ అభ్యర్థులే కరువయ్యారు. మేయర్ అభ్యర్థులే ఆర్థికంగా వార్డు అభ్యర్థులను ఆదుకోవాల్సి ఉంటుందని టీడీపీ సూచించింది. అయినా అనేక చోట్ల ఈ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వైసీపీ కొంత విజయావకాశాలే కనిపిస్తున్నాయి. అయితే పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్