https://oktelugu.com/

బీజేపీతో దోస్తీ కటీఫ్ కు పవన్ యోచనా?

ఏపీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్న బీజేపీతో అంటకాగితే ఉన్న సీట్లు కూడా రావని.. పంచాయతీ ఎన్నికల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడిపోయారట.. క్షేత్రస్థాయిలో జనసేనకు వచ్చిన మద్దతు చూసి బీజేపీకి ఎంత దూరంగా జరిగితే అంత మంచిది అన్నట్టుగా పవన్ తీరు కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. తిరుపతి పార్లమెంట్ కు నోటిఫికేషన్ వచ్చినా ఇంతవరకు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్ని త్యాగాలు చేసినా బీజేపీ మాత్రం జనసేనకు సీటుకు ఇచ్చే అవకాశాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 11:17 am
    Follow us on

    ఏపీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్న బీజేపీతో అంటకాగితే ఉన్న సీట్లు కూడా రావని.. పంచాయతీ ఎన్నికల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడిపోయారట.. క్షేత్రస్థాయిలో జనసేనకు వచ్చిన మద్దతు చూసి బీజేపీకి ఎంత దూరంగా జరిగితే అంత మంచిది అన్నట్టుగా పవన్ తీరు కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. తిరుపతి పార్లమెంట్ కు నోటిఫికేషన్ వచ్చినా ఇంతవరకు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్ని త్యాగాలు చేసినా బీజేపీ మాత్రం జనసేనకు సీటుకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో జనసేన విజయం దృష్ట్యా ఆ కోపం కూడా బీజేపీతో తెగదెంపులకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    2014కు ముందు జనసేన పార్టీని స్తాపించిన పవన్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. నాటి ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబు-బీజేపీలకు మద్దతిచ్చి గెలిపించారు. ఇక గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని పలు చోట్ల పోటీ చేసిన జనసేన మొత్తంగా ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఫాం హౌజ్ కే పరిమితమయ్యారు. ఆ తరువాత రైతు సమస్యలపై యాత్ర నిర్వహిస్తూ వారిని కలుస్తూ వస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు నచ్చని ఆయన కమలంతో తెగదెంపులు చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని చర్చ జరుగుతోంది.

    రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకొని జనంలో తిరిగారు. ఆ తరువాత 2018లో సొంతంగా ‘జనసేన’పేరుతో పార్టీ స్థాపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఎక్కువగా పట్టు సాధించలేకపోయింది. గత హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవగా.. బీజేపీ పెద్దల సూచనతో పోటీ నుంచి వైదొలిగి బీజేపీకి మద్దతుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయకుండా వైదొలిగారు.

    ఏపీలోనూ బీజేపీతో కలిసి పవన్ అంతర్వేది లాంటి సమస్యలపై జనసైనికులు ఆందోళన నిర్వహించారు. ఆ తరువాత రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాయి. త్వరలో తిరుపతిలో జరిగే ఎంపీ ఉప ఎన్నికల్లోనూ రెండు పార్టీల అంగీకారంతోనే పోటీ చేస్తామని ఆయా పార్టీల అధ్యక్షులు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు.

    అయితే ఇటీవల కొత్త చిక్కు వచ్చి పడింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అని అంటున్నా..కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదు. దీంతో రాష్ట్ర పార్టీలన్నీ బీజేపీ వైపే వేలు చూపుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనను కూడా ఏపీ ప్రజలు, ఉద్యమకారులు ప్రైవేటీకరణ విషయంపై తప్పుబట్టాయి. పరిస్థితి విషమించకముందే జనసేన పార్టీ నాయకులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు ఇద్దరూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రైవేటీకరణపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు.

    అయితే ఇప్పటి వరకు బీజేపీ వీరి వినతిని పట్టించుకోలేదు కాదు కదా.. కనీసం దాని గురించి మట్లాడడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు కొన్ని స్థానాలు లభించాయి. ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేని చోట్ల సైతం జనసైనికులంతా కలిసి సర్పంచ్ లను గెలిపించారు. అయితే కొన్ని చోట్ల మాత్రం టీడీపీతో జత కట్టారు.

    ఏపీ రాజకీయాల్లో జనసేన ఒంటరిగా వెళితే లాభిస్తుందని పవన్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే అమరావతి, పోలవరం విషయంలో బీజేపీని ప్రతిపక్షాలతో పాటు కొందరు విద్యావంతులు బీజేపీదే తప్పంటున్నారు. తాజాగ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలోనూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడుతున్నారు. ఈ సమయంలో బీజేపీతో కలిసి వెళ్తే తమ పార్టీ కూడా నష్టపోతుందని పవన్ ఆలోచిస్తున్నారట. దీంతో ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది.