
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ బిట్ కాయిన్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నిషేధానికి సంబంధించిన బిల్లులను తయారు చేసిందని బిట్ కాయిన్ తో పాటు ఇతర ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలపై నిషేధం అమలులోకి రానుందని సమాచారం. ఇదే సమయంలో సొంత క్రిప్టో కరెన్సీ దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం.
రోజురోజుకు వర్చువల్ కరెన్సీ, ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ గతంలోనే క్రిప్టో కరెన్సీపై బ్యాన్ విధించగా 2020 సంవత్సరం మార్చి నెలలో రద్దు చేసింది. రూపాయి డిజిటల్ వెర్షన్ జారీ చేసే యోచనలో కూడా కేంద్రం ఉందని సమాచారం. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్నా అదే సమయంలో నష్టాల భయాలు కూడా పెరుగుతుండటం గమనార్హం.
అయితే ఆర్బీఐ, కేంద్రం క్రిప్టో కరెన్సీ బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నా క్రిప్టో పరిశ్రమ నిపుణులు మాత్రం క్రిప్టో కరెన్సీని నిషేధించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని చెబుతున్నారు. మన దేశంలో 70 లక్షల క్రిప్టో హోల్డర్లు ఉన్నారని.. భారతీయులకు 100 కోట్ల బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తం క్రిప్టో ఆస్తులు ఉన్నాయని ఈ ఆస్తులను నిషేధించడం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ లో 20 బిల్లులను ప్రవేశపెట్టనుందని ఆ బిల్లులలోనే క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 బిల్లు కూడా ఉందని సమాచారం. మరి కేంద్రం క్రిప్టో కరెన్సీ బ్యాన్ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాల్సి ఉంది.