మహిళ కొంపముంచిన గూగుల్ సెర్చ్.. మూడు లక్షలు మాయం..?

మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే గూగుల్ కొన్నిసార్లు అసలు సమాచారానికి బదులుగా సైబర్ మోసగాళ్లు పెట్టిన సమాచారాన్ని చూపిస్తే మాత్రం మనం ఇబ్బందుల్లో పడినట్లేనని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళ గూగుల్ సెర్చ్ చేసి ఏకంగా 3,10,000 రూపాయలు మోసపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒక మహిళ ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ లో […]

Written By: Navya, Updated On : March 7, 2021 11:27 am
Follow us on

మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే గూగుల్ కొన్నిసార్లు అసలు సమాచారానికి బదులుగా సైబర్ మోసగాళ్లు పెట్టిన సమాచారాన్ని చూపిస్తే మాత్రం మనం ఇబ్బందుల్లో పడినట్లేనని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళ గూగుల్ సెర్చ్ చేసి ఏకంగా 3,10,000 రూపాయలు మోసపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒక మహిళ ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ లో ఒక వస్తువును ఆర్డర్ చేసింది. అయితే ఆ ఆర్డర్ డెలివరీ కాకపోవడంతో మహిళ అమెజాన్ నంబర్ కోసం గూగుల్ లో వెతికింది. ఆ తరువాత గూగుల్ లో కస్టమర్ కేర్ నంబర్ పేరుతో చూపించిన నంబర్ కు కాల్ చేసిన మహిళ కాల్ లో ఆర్డర్ వివరాలు చెప్పి ఆర్డర్ డెలివరీ కాలేదని ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు చేసిన తరువాత అమెజాన్ ప్రతినిధి పేరుతో మహిళకు కాల్ వచ్చింది. ఆ కాల్ లో సైబర్ మోసగాడు స్టాక్ లేకపోవడం వల్ల వస్తువు డెలివరీ కాలేదని.. ఫోన్ కు వచ్చే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మహిళ బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమవుతాయని చెప్పాడు. అతని మాటలు విని మహిళ ఆ వ్యక్తి చెప్పిన విధంగా చేయగా ఆ మహిళ ఖాతా నుంచి ఏకంగా 3,10,000 రూపాయలు డెబిట్ అయ్యాయి.

డబ్బులు డెబిట్ కావడంతో మహిళ మళ్లీ ఆ నంబర్ కు ఫోన్ చేయగా ఆ ఫోన్ నంబర్ స్విఛాఫ్ వచ్చింది. ఆ తరువాత మహిళ మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.