పురాతన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చలువ చేసే గుణాలు ఎక్కువగా ఉన్న యాలకులను పానీయాల్లో, వంటకాల్లో, స్వీట్ల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. యాలకులు ఎలాంటి స్వీట్ కైనా మంచి సువాసనతో పాటు రుచిని అందిస్తాయి. ప్రతిరోజు భోజనం తరువాత ఒక యాలక్కాయను తీసుకుంటే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
యాలకుల్లో ఉండే ఐరన్ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. యాలకులు క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడంలో సహాయపడతాయి. యాలకులతో చేసిన వంటకాలు, పానీయాలను తీసుకుంటే ఉబ్బసం సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాలకుల్లో శరీరానికి అవసరమైన ఏ, బి, సి, రైబోఫ్లేవిన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. యాలకులు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తాయి.
కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్లు యాలకులు తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను మెత్తగా నూరి నుదిటికి రాస్తే తక్కువ సమయంలో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులు నోటి దుర్వాసనను అరికట్టడంతో పాటు దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకుల కషాయం తాగితే వాంతులు తగ్గడంతో పాటు జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.
యాలకుల తైలం పంటినొప్పిని నివారించడంతో పాటు క్రిముల్ని సమూలంగా నాశనం చేయడంలో సహాయపడుతుంది. యాలకులు ఆకలి పెంచడంలో సహాయపడటంతో పాటు దగ్గు, జలుబు లాంటి సమస్యలకు చెక్ పెడతాయి. యాలకులు వేసి మరిగించిన టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది.