స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్లు..?

కాలం మారే కొద్దీ టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోన్లను వినియోగదారుల కొరకు అందుబాటులోకి తెస్తున్నాయి. గతేడాది ఎన్నో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రాగా ఈ ఏడాది అద్భుతమైన ఫీచర్లతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ ఏడాది శాంసంగ్ సంస్థ వినియోగదారుల కోసం గెలాక్సీ ఎఫ్ 62 ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. […]

Written By: Kusuma Aggunna, Updated On : February 9, 2021 6:44 pm
Follow us on

కాలం మారే కొద్దీ టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోన్లను వినియోగదారుల కొరకు అందుబాటులోకి తెస్తున్నాయి. గతేడాది ఎన్నో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రాగా ఈ ఏడాది అద్భుతమైన ఫీచర్లతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

ఈ ఏడాది శాంసంగ్ సంస్థ వినియోగదారుల కోసం గెలాక్సీ ఎఫ్ 62 ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 41 మోడల్ కు కొనసాగింపుగా రాబోతున్న ఈ మోడల్ వచ్చే వారం విడుదల కానుందని సమాచారం. ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తో 7,000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీతో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. 64 మెగా పిక్సల్ కెమెరాతో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర 25,000 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఫిబ్రవరి 10వ తేదీన నోకియా 5.4 మోడల్ 4జీబీ, 6జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 16,000 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పని చేసే ఈ ఫోన్ 6 : 39 అంగుళాల హెచ్.డీ + డిస్ ప్లేను కలిగి ఉంది. 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో 4,000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ పని చేయనుందని తెలుస్తోంది.

వన్ ప్లస్ 9ప్రో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ ను తీసుకొస్తుండగా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పని చేస్తుందని.. ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయని తెలుస్తోంది. క్యూహెచ్డీ ప్లస్ డిస్ ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం. వివో వి2055ఏ పేరుతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో వినియోగించినట్లు తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ52 ఫోన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ 750 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేయనుందని ఈ ఫోన్ లో 4,500 ఎం.ఏ.హెచ్ బ్యాటరీ ఉండదనుందని సమాచారం. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 40,000 రూపాయలు ఉంటుందని సమాచారం.ఒప్పో ఎఫ్ 19, శాంసంగ్ గెలాక్సీ ఏ 12, ఐ ఫోన్ ఎస్.ఈ3 ఫోన్లు కూడా ఈ ఏడాది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.