https://oktelugu.com/

అఘోరాగా బాలయ్య.. పిక్ వైరల్ ?

నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమాలో బాలయ్య బాబు డబుల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు అన్నదమ్మలు చిన్నతనంలోనే విడిపోగా వారిలో ఒకరు అఘోరాగా మారతాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య ఈ గెటప్ వేసినట్లు తెలుస్తోంది. ఈ గెటప్ లో బాలయ్య చాలా కొత్తగా ఉన్నాడట. అన్నట్లు ఇంటర్వెల్ లో ఈ పాత్ర ఎంట్రీ అవుతుందని, ప్రస్తుతం బాలయ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. […]

Written By:
  • admin
  • , Updated On : February 9, 2021 / 06:47 PM IST
    Follow us on


    నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమాలో బాలయ్య బాబు డబుల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు అన్నదమ్మలు చిన్నతనంలోనే విడిపోగా వారిలో ఒకరు అఘోరాగా మారతాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య ఈ గెటప్ వేసినట్లు తెలుస్తోంది. ఈ గెటప్ లో బాలయ్య చాలా కొత్తగా ఉన్నాడట. అన్నట్లు ఇంటర్వెల్ లో ఈ పాత్ర ఎంట్రీ అవుతుందని, ప్రస్తుతం బాలయ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఆ యాక్షన్ ఘట్టం చిత్రీకరిస్తున్నారు.

    Also Read: టీజర్ టాక్: రైతుల కష్టాలకు చెక్ పెట్టే ‘శ్రీకారం’

    కాగా ఈ సినిమాలో ఈ గెటప్, దీంతో ముడిపడ్డ సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయని, చిత్రానికే పెద్ద హైలైట్ అవుతాయని అంటున్నారు. మరి చూడాలి బాలయ్య అఘోరాలా ఎలా ఉంటాడో. కానీ, బాలయ్య అఘోరాగా కనిపిస్తే జనం చూస్తారా ? ముఖ్యంగా అఘోరా అంటే ఒంటి నిండి బూడద పూసుకుని, గోచీలు పెట్టుకుని జడలు పెరిగిన జుట్టుతో కనిపించాలి. అలా బాలయ్య కనిపిస్తే.. ఆయన అభిమానులు రిసీవ్ చేసుకుంటారా ? ఆ గెటప్ లో బాలయ్యను అస్సలు ఊహించుకుంటారా..? ఏ మాత్రం తేడా జరిగిన అసలుకే మోసం వస్తోంది. ఇక ప్రస్తుత షెడ్యూల్ లో ఈ అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు అన్ని పూర్తి కానున్నాయి.

    Also Read: ఎక్స్ క్లూజివ్ : చరిత్ర కారుడిగా బాలయ్య.. పూరి కొత్త కథ !

    కాగా ఈ సినిమాలో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు చాల బాగుంటాయట, బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందని.. అందుకే బోయపాటి ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని షూట్ చేయబోతున్నారని సమాచారం. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించడంతో బాలయ్య అభిమానులు బోయపాటి పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలంటే బోయపాటి రోటన్ యాక్షన్ కొట్టుడుకు దూరంగా ఉండాలి. మరి బాలయ్యకు బోయపాటి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్