https://oktelugu.com/

ఎస్‌బీఐ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ ఇది. మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్‌ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ భావిస్తోందట. చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారులు.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకం లేదా కంపెనీ ప్రకటించిన రీపేమెంట్‌ గడువును ఎంచుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్స్‌ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్‌ తివారీ వెల్లడించారు. రెండింటిలోనూ ఆకర్షణీయమైన ‘వడ్డీ’ రేటు ఉంటుందన్నారు. దీంతో తమ క్రెడిట్‌ కార్డ్స్‌ బిల్స్‌ చెల్లించేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2020 / 09:43 AM IST

    Sbi credit card holders

    Follow us on

    ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ ఇది. మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్‌ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ భావిస్తోందట. చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారులు.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకం లేదా కంపెనీ ప్రకటించిన రీపేమెంట్‌ గడువును ఎంచుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్స్‌ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్‌ తివారీ వెల్లడించారు. రెండింటిలోనూ ఆకర్షణీయమైన ‘వడ్డీ’ రేటు ఉంటుందన్నారు.

    దీంతో తమ క్రెడిట్‌ కార్డ్స్‌ బిల్స్‌ చెల్లించేందుకు మరికొంత గడువు లభించినట్లే. అయితే కంపెనీ ప్రకటించే రీపేమెంట్‌ పథకాన్ని ఎంచుకుంటే.. క్రెడిట్‌ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు ‘సిబిల్‌’కు చేరవన్నారు. అలా చేయడం వల్ల వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని తివారీ చెప్పారు.

    కొవిడ్‌ అనిశ్చితి ఇంకా పోలేదని.. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి కానీ పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని తాము భావిస్తున్నట్లు తివారీ తెలిపారు. సెప్టెంబరుతో ముగిసే రెండో త్రైమాసికం కష్టంగానే ఉంటుందన్నారు. కొవిడ్‌, లాక్‌డౌన్ల కారణంగా ఎన్‌పీఏల భారంతో కేటాయింపుల పోటు తప్పకపోవచ్చన్నారు.