మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్ ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కరోనా కణాలను ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. మాస్కుల ద్వారానే కోవిడ్ ను నియంత్రించవచ్చని ఈ పరిశోధన ద్వారా తేలిందన్నారు.
కరోనా వైరస్ సోకిన కణాలు శ్వాసకోశాల్లో ఎలా ఉంటాయనేది ఫొటోల్లో స్పష్టంగా కనిపించింది. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించింది ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందనేది సులభంగా అర్థమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు.
మానవ శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతా వ్యాపించడంతోపాటు ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు.
దీన్ని బట్టి వేగంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మాస్క్ శానిటైజర్ చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే మార్గం అని తేల్చారు.