కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ బంగారంపై సుంకం తగ్గించడంతో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు బంగారం ధర మరింత తగ్గడం గమనార్హం. 10 గ్రాముల మేలిమి బంగారం ఏకంగా 679 రూపాయలు తగ్గడంతో 45 వేల మార్క్ దిగువకు చేరింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 44,760 రూపాయలుగా ఉంది.
Also Read: యాపిల్ ఫోన్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన మహిళ.. పార్సిల్ చూసి షాక్..?
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గడం గమనార్హం. వెండి ధర ఏకంగా 1,847 రూపాయలు తగ్గడంతో కిలో వెండి ధర 67,073 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ వెల్లడించిన వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గడం వల్లే దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు పతనమైనట్లు తెలుస్తోంది. బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
Also Read: తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..?
అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర 1,719 డాలర్లుగా ఉండగా ఔన్సు వెండి ధర 26.08 డాలర్లుగా ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సమాచారం. బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని చెప్పవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. మరో రెండు నెలల వరకు పెళ్లిళ్లు లేకపోవడంతో గతంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు కూడా భారీగా తగ్గాయని చెప్పవచ్చు.