బంగారంపై లోన్ తీసుకుంటున్నారా..? ఇవి గుర్తుంచుకోండి..!

మన దేశంలో చాలామంది పసిడి కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. పండుగ సమయాల్లో, ప్రత్యేక దినాల్లో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరైనా తక్కువ సమయంలో రుణం తీసుకోవాలని భావిస్తే బంగారంపై రుణం తీసుకోవడానికే ఆసక్తి చూపుతారు. బ్యాంకులు సైతం క్రెడిట్‌ స్కార్‌లను పరిగణనలోకి తీసుకోకుండానే బంగారంపై రుణాలను మంజూరు చేస్తూ ఉండటం గమనార్హం. రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని కూడా అంచనా వేయకుండా బ్యాంకులు బంగారంపై రుణాలను మంజూరు చేస్తుండటం గమనార్హం. మణప్పురం, ముత్తూట్‌ […]

Written By: Navya, Updated On : February 21, 2021 7:56 pm
Follow us on

మన దేశంలో చాలామంది పసిడి కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. పండుగ సమయాల్లో, ప్రత్యేక దినాల్లో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరైనా తక్కువ సమయంలో రుణం తీసుకోవాలని భావిస్తే బంగారంపై రుణం తీసుకోవడానికే ఆసక్తి చూపుతారు. బ్యాంకులు సైతం క్రెడిట్‌ స్కార్‌లను పరిగణనలోకి తీసుకోకుండానే బంగారంపై రుణాలను మంజూరు చేస్తూ ఉండటం గమనార్హం.

రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని కూడా అంచనా వేయకుండా బ్యాంకులు బంగారంపై రుణాలను మంజూరు చేస్తుండటం గమనార్హం. మణప్పురం, ముత్తూట్‌ ఫైనాన్స్ బంగారం రుణం వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి సారించి రుణాలను మంజూరు చేస్తాయి. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. బ్యాంకులు బంగారంపై తక్కువ వడ్డీకే రుణం ఇస్తే ఎన్‌బీఎఫ్‌సీ ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి.

నాన్ ‌- బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలలో వడ్డీరేటు బ్యాంకులతో పోల్చి చూస్తే ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రెండు వాస్తవిక బంగారం విలువలో 75 శాతం ఇస్తాయి. కానీ ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తే ఎన్‌బీఎఫ్‌సీలు త్వరగా రుణాన్ని మంజూరు చేయడంలో ముందువరసలో ఉంటాయి.

బంగారం కనీస స్వచ్చత 18 క్యారెట్లు ఉంటే మాత్రమే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. బంగారంపై ఛార్జీల విషయంలో బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మార్పులు ఉంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు, నాన్ ‌- బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు వేర్వేరు ఆప్షన్లను అమలు చేస్తున్నాయి.