Bro Movie: వినోదయ సీతమ్ కి.. ‘బ్రో’ మూవీకి మధ్య తేడాలివే..

వినోదయ సితం చిత్ర బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు. బ్రో చిత్రానికి ఒక్క పవన్ కళ్యాణ్ రూ. 50 కోట్లు తీసుకున్నారు. ఒక అంచనా ప్రకారం బ్రో రూ. 70-80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

Written By: Shiva, Updated On : August 1, 2023 4:13 pm

Bro Movie

Follow us on

Bro Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేడు పండగ రోజు. ఆయన నటించిన బ్రో విడుదలైంది. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. బ్రో మూవీలో మరో మెగా హీరో సాయి ధరమ్ నటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్శకుడు సముద్రఖని సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. బ్రో తమిళ చిత్రం వినోదయసితం రీమేకన్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు చిత్రాల మధ్య బేధాలు తెలుసుకుంటే బ్రో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

వినోదయ సితం సినిమా అనుకోకుండా తెరపైకి వచ్చింది. జీ5 సంస్థకు సముద్రఖని ఒక చిత్రం చేయాల్సి ఉండగా ఐదు కథలు వినిపించాడట. ఇచ్చిన అరగంట సమయంలో పది నిమిషాల టైం ఉండగా చివరిగా వినోదయసితం కథ చెప్పారట. నిర్మాతలకు వినోదయ సితం కథ నచ్చడంతో ఓకే చేశారట.

వినోదయ సితంలో సముద్రఖని దర్శకత్వం వహించి నటించారు. ప్రధాన పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ తంబి రామయ్య చేశారు. వినోదయ సితం కథ పరిశీలిస్తే… పరశురామ్(తంబి రామయ్య) ఓ కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగి. తన జీవితమంతా వృత్తిపరమైన ఎదుగుదలకే కేటాయిస్తారు. ఒకరోజు హఠాత్తుగా మరణిస్తాడు. జీవితంలో ఏం చేయలేదు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేదని బాధపడిపోతాడు. అప్పుడు టైం గాడ్(సముద్రఖని) అతనికి మరో ఛాన్స్ ఇస్తాడు. 90 రోజులు మాత్రమే నువ్వు బ్రతుకుతావు. ఈ నిర్ణీత సమయంలో మరో జీవితం అనుభవించమంటాడు. అప్పుడు పరశురామ్ దేవుడు ఇచ్చిన కాలాన్ని ఎలా వాడుకున్నాడనేది కథ.

బ్రో కథ కూడా దాదాపు ఇంతే. అయితే ఒరిజినల్ లో 70 ఏళ్ల పాత్రను యువకుడైన సాయి ధరమ్ తేజ్ తో చేయించారు. దాని వలన మూల కథలో మార్పులు చేశారు. టైం గాడ్ గా పవన్ కళ్యాణ్ నటించారు. వినోదయ సితం మూవీ చూసి ఓ పెద్దాయన ఫోన్ చేసి ఏడ్చేశాడట. అప్పుడు ఈ కథను మరింత మందికి రీచ్ అయ్యేలా చేయాలనే ఆలోచన సముద్ర ఖనికి వచ్చిందట. ఈ విషయం త్రివిక్రమ్ కి చెప్పడంతో పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఒప్పించారట. అలా పవన్ ప్యాకెట్లోకి వినోదయ సితం రీమేక్ వచ్చి చేరింది.

బ్రో-వినోదయ సితం మధ్య తేడాలు ఇవే…

వినోదయ సితం చిత్ర బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు. బ్రో చిత్రానికి ఒక్క పవన్ కళ్యాణ్ రూ. 50 కోట్లు తీసుకున్నారు. ఒక అంచనా ప్రకారం బ్రో రూ. 70-80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఒరిజినల్ వినోదయ సితం లో సాంగ్స్ లేవు. ఒక పాట మాత్రం నేపథ్యంలో వస్తుంది. పవన్, సాయి ధరమ్ ఇమేజ్ రీత్యా బ్రో చిత్రంలో మూడు పాటలు పెట్టారు. థమన్ సంగీతం అందించారు.

వినోదయ సితం లో యాక్షన్ సన్నివేశాలు కూడా లేవు. బ్రో మూవీలో రెండు పెట్టారు. వినోదయ సితం కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ పై నడిపించారు. ఒరిగిల్ లో హీరోయిన్స్ లేరు. బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు.

వినోదయ సితం రీమేక్ నిడివి కేవలం 99 నిమిషాలు. బ్రో మూవీ నిడివి 135 నిమిషాలు. ఒరిజినల్ లో సముద్రఖని పాత్ర పరిధి తక్కువ. గెస్ట్ రోల్ వలె ఉంటుంది. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది.