Homeఅంతర్జాతీయంGlobal Hunger Index 2022: ఆకలి గురించి కాదు.. అన్నం గిన్నె పైనే వారి...

Global Hunger Index 2022: ఆకలి గురించి కాదు.. అన్నం గిన్నె పైనే వారి కడుపు మంట

Global Hunger Index 2022: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు, పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో.. దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 1975 లో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను అమెరికా ఏర్పాటు చేసింది. దాని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ లో ఉంది. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ! ఐ ఎఫ్ ఆర్ ఐ కి దక్షిణాసియా లో ఢిల్లీ లో ప్రాంతీయ హెడ్ క్వార్టర్ ఉంది. ప్రతీ సంవత్సరం వివిధ దేశాలలో చిన్నపిల్లల, పెద్దల పౌష్టికాహారము ఎంత తీసుకుంటున్నారో సర్వే చేస్తుంది. దాని ప్రకారం వివిధ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. దేశం మొత్తం మీద నాలుగు మూలలా తిరిగి దాదాపుగా 3000 మందిని ప్రశ్నిస్తుంది. సంస్థ సభ్యులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి ? పేదలు ఉండే చోటుకి వెళ్ళి రోజూ ఎంత ఆహారం తీసుకుంటున్నారు ? మీరు తీసుకునే ఆహారంలో ఎలాంటి పదార్ధాలు ఉంటాయి ? ఇలా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతుంది. అలా రాబట్టిన సమాధానాలని క్రోడీకరించి ఆయా దేశాల ర్యాంకులని నిర్ణయిస్తుంది. అసలు పౌష్టికాహారం అంటే ఈ అమెరికన్ ఏజెన్సీ దృష్టిలో రోజూ కోడి గుడ్లు తీసుకోవడం, రోజూ కనీసం 100 గ్రాముల కోడి మాంసం తీసుకోవడం లేదా వేరే జంతువుల మాంసం తీసుకోవడం లాంటివి అన్నమాట ! కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు ఎంత శాతం తీసుకునే ఆహారంలో ఉంటున్నదో లెక్క కడుతుంది. వీళ్ళ లెక్కల ప్రకారం కందిపప్పు తినడం వలన ప్రోటీన్లు శరీరానికి కావలసినంతగా అందవు. రోజూ కోడి గుడ్లు,కోడి లేదా ఇతర జంతు మాంసం తినేవారి సంఖ్య భారత్ లో ఎంత ఉంటుంది అందులోనూ పేద వాళ్ళు రోజూ కోడి గుడ్లు, ఇతర జంతు మాంసం తినగలరా ?

Global Hunger Index 2022
Global Hunger Index 2022

ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు?

130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 3000 సాంపుల్స్ తీసుకొని వాటిని ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు ? మొత్తం యూరోపు జనాభా వచ్చేసి 74,86,75,003 కోట్లు. అంటే మన దేశ జనాభా తో పోలిస్తే సగానికి సగం ఉంది. శ్రీలంక జనాభా 2 కోట్ల 19 లక్షలు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా 3 కోట్ల 89 లక్షలు. పాకిస్థాన్ జనాభా 23 కోట్ల 67 లక్షలు. పాకిస్థాన్ జనాభా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంది. శ్రీలంక జనాభా కేరళ రాష్ట్రమంత కూడా లేదు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా తెలంగాణ జనాభాతో సమానంగా ఉంది. అంటే 2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక దేశంలో 3000 సాంపుల్ సర్వే చేసి ర్యాంక్ నిర్ణయిస్తారా ? అటువంటప్పుడు మన కేరళ తో పోల్చి శ్రీలంకకి ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ? పాకిస్థాన్ జనాభాతో సమానం గా ఉన్న ఉత్తరప్రదేశ్ జనాభా ని పోల్చుతూ పాకిస్థాన్ ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ? ఇలా చూస్తే భారత దేశం మొత్తం లో 3 వేల సాంపుల్ సర్వే చేసి 130 కోట్ల జనాభాకి ఎలా లెక్కకడతారు ? గత జులై నెలలో ఈ 3 వేల సాంపుల్ సర్వే మీద భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది పైన పేర్కొన్న గణాంకాల ని సరిపోలుస్తూ ! కోవిడ్ విజృంభించిన తరువాత భారత ప్రభుత్వం 80 కోట్ల మందికి సరిపడా ప్రతినెలా సబ్సిడీ మీద గోధుమలని ఇస్తున్నది రాష్ట్రాలకి ఇప్పటి వరకు.

Global Hunger Index 2022
Global Hunger Index 2022

ఇందులో బిలో పావర్టీ లైన్ అనే ప్రాతిపదిక మీద 40 కోట్ల జనాభాకి ఉచితంగా రేషన్ ఇస్తూ వస్తున్నది 2020 నుండి ఇప్పటివరకు. ఈ స్కీమ్ ని మరో మూడు నెలలు పొడిగించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం ! హంగర్ ఇండెక్స్ అంటే పౌష్టికాహార లోపం అని అర్ధం కానీ దీనికి వాళ్ళకి అనుకూలమయిన పారమీటర్స్ కి అన్వయించి ర్యాంకులు ఇస్తున్నది ఐ ఎఫ్ ఆర్ ఐ. ఒక దేశంలో కేవలం రొట్టెలు తిని బ్రతుకుతారు అది వాళ్ళ అలవాటు. ఆ రొట్టెలలోకి పప్పు లేకపోతే మాంసాహారం కలిపి తింటారు. డబ్బులు లేని రోజున పప్పు లేదా జామ్ తో తింటారు. అంత మాత్రాన అది పౌష్టికాహార లోపం ఎలా అవుతుంది ? అలా అయితే దక్షిణాది రాష్ట్రాలతో సహా ఒరిస్సా,బెంగాల్,అస్సాం లలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉంటుంది అంటే ఇది పౌష్టికాహార లోపమా ?
గతంలో అంటే 6 నెలల క్రితం అత్యంత సంతోషంగా ఉండే దశాల లిస్ట్ లో శ్రీలంక తో పాటు పాకిస్థాన్,బంగ్లాదేశ్,నేపాల్ లని చేర్చి వాటి కంటే దిగువన భారత్ ఉన్నట్లు ప్రచారం చేశారు.

ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా

తీరా చూస్తే శ్రీలంక,బంగ్లాదేశ్,పాకిస్థాన్ ల తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ల పరిస్థితి ఈ రోజున ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు.
శ్రీలంకకి మనం బియ్యం తో పాటు పెట్రోల్,డీజిల్,నోటు పుస్తకాలు ఇవ్వకపోతే రోజు గడవట్లేదు. ఇక మందుల సంగతి సరే సరి ! ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా అంతే. పాకిస్థాన్ తాజాగా 5 కోట్ల దోమ తెరలు కావాలని భారత్ ని అభ్యర్ధించింది. మరి ఈ దేశాలు హంగర్ ఇండెక్స్ లో భారత్ కంటే ఎలా పైనా ఉన్నాయి ?పాకిస్థాన్ లో కిలో గోధుమపిండి 170 రూపాయలు అయితే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ? గ్యాస్ సిలెండర్ ధర 4500 రూపాయలు అదీ బ్లాకులో కొనాల్సిన చోట పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ? శ్రీలంక లో అయితే గత 10 నెలలుగా నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతుంటే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ?
మరీ విచిత్రం ఏమిటంటే నేపాల్ మన కంటే మెరుగ్గా ఉంది అని
2024 ఎన్నికలు పూర్తయే వరకు ఇలాంటి బోగస్ ప్రచారం చేస్తూనే ఉంటారు.
IFRI రిపోర్ట్ రాగానే పుర్ర చేయి అభిమానులు సోషల్ మీడియాలో సంబరం చేసుకుంటున్నారు. ఇంకో రెండు నెలలు ఆగితే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్,శ్రీలంక ల స్థితి ఎలా ఉండబోతుందో తెలసిపోతుంది. అసలు ఈ శీతాకాలం లో యూరపులో చలికి ఎంత మంది చనిపోతారో చూద్దాం !
ఒక్కడి ఓటమి కోసం ప్రపంచం ఏకం అవుతున్నదీ అంటే ఆ ఒక్కడు ఎంతలా ప్రభావితం చేస్తున్నాడో అర్ధమయిపోవట్ల?

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular