ఆ ఇంటి ముందు 42 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్.. అసలేం జరిగిందంటే…?

భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం రోజురోజుకు ఫుడ్ డెలివరీలపై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేకపోయినా వండిన వంట రుచిగా లేకపోయినా చాలామంది ఫుడ్ ఆర్డర్ చేయాలని భావిస్తున్నారు. దీంతో రోజురోజుకు ఫుడ్ ఆర్డర్ డెలివరీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒక దేశంలో మాత్రం ఒకే ఇంటికి 42 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. Also Read: కస్టమర్లకు శుభవార్త.. జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్ విడుదల […]

Written By: Kusuma Aggunna, Updated On : December 4, 2020 11:58 am
Follow us on


భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం రోజురోజుకు ఫుడ్ డెలివరీలపై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేకపోయినా వండిన వంట రుచిగా లేకపోయినా చాలామంది ఫుడ్ ఆర్డర్ చేయాలని భావిస్తున్నారు. దీంతో రోజురోజుకు ఫుడ్ ఆర్డర్ డెలివరీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒక దేశంలో మాత్రం ఒకే ఇంటికి 42 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి.

Also Read: కస్టమర్లకు శుభవార్త.. జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్ విడుదల ఎప్పుడంటే..?

ఆ 42 ఫుడ్ ఆర్డర్లు చేసింది ఒక చిన్న పాప కావడం గమనార్హం. ఇంట్లో ఫంక్షన్ లేకపోయినా ఆ పాప అనుకోకుండా చేసిన పొరపాటు ఇంటి ముందు 42 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూ కట్టడానికి కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫిలిప్పీన్స్ నగరంలోని సెబూలో ఏడు సంవత్సరాల బాలిక ఫుడ్ ఫండా యాప్ ద్వారా చికెన్ కుల్లెట్స్ ఒకటి ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ చేసే సమయంలో ఫోన్ లో ఇంటర్నెట్ సరిగ్గా లేదు.

Also Read: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త.. ఆ సర్వీసులు పెంపు..?

దీంతో పాప ఫుడ్ ఆర్డర్ పై పదే పదే ప్రెస్ చేసింది. దీంతో ఏకంగా 42 ఆర్డర్లు బుక్ అయ్యాయి. ఫుడ్ పండా యాప్ లోని సాంకేతిక లోపం కారణంగా ఆ నగరంలో సగం మంది ఫుడ్ పండా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. ఇంటికి అంతమంది డెలివరీ బాయ్స్ రావడంతో పాప కంగారు పడి తాను ఒక చికెన్ కుల్లెట్ మాత్రమే ఆర్డర్ చేశానని వాళ్లకు తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కు ఎక్కడో తప్పు జరిగిందని అర్థమైంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తలు కోసం: ఇంటర్నేషనల్

డెలివరీ బాయ్స్ ఒక ఆర్డర్ కు మాత్రమే నగదు స్వీకరించి ఒక చికెన్ కుల్లెట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే పాప చేసిన పని వల్ల 41 మంది ఫుడ్ పండా డెలివరీ బాయ్స్ సమయం వృథా అయింది. ఒక మహిళ సోషల్ మీడియా వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.