https://oktelugu.com/

ఈ తప్పులు చేస్తున్నారా.. గ్యాస్ సిలిండర్ పేలిపోయే ఛాన్స్..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సిలిండర్ ను వినియోగించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నట్టు వాసన వస్తే అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఐదేళ్లు జైలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 11, 2021 12:20 pm
    Follow us on

    Gas Cylinder Safety Precautions.

    దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సిలిండర్ ను వినియోగించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నట్టు వాసన వస్తే అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష..?

    గ్యాస్ లీకేజీ అయిన సమయంలో అగ్గిపుల్ల వెలిగించడం, లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ స్విఛ్ లు వేయడం చేయవచ్చు. గ్యాస్‌ పైప్‌ ఊడిపోయినా, పగిలిపోయినా రెగ్యులేటర్ ను మూసివేసి సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. స్టౌవ్ ను సిలిండర్ కంటే ఎత్తులోనే ఉంచడంతో పాటు స్టౌవ్ నుంచి సిలిండర్ వరకు ఒకే రబ్బర్ ట్యూబ్ ను వినియోగించాలి. సిలిండర్ ను ఎల్లవేళలా నిలువుగా మాత్రమే ఉంచాలి.

    Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. డబ్బులు లేకున్నా విత్ డ్రా..?

    ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ రబ్బర్ ట్యూబ్ ను తప్పనిసరిగా మార్చాలి. సిలిండర్ లో గ్యాస్ అయిపోయిన తరువాత సిలిండర్ ను పడుకోబెట్టి స్టౌవ్ ను వెలిగించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సిలిండర్ ను తొలగించే సమయంలో మొదట స్టవ్‌ బర్నర్‌ స్విచ్‌లను ఆఫ్ చేసి రెగ్యులేటర్ ను గట్టిగా పట్టుకుని నల్లని ప్లాస్టిక్‌ లాకింగ్‌ రింగ్‌ ను పైకి లాగాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఫుల్ సిలిండర్ ను ఏర్పాటు చేసే సమయంలో సేఫ్టీ క్యాప్ ను వాల్వ్ మీద నుంచి పైకి తీయాల్సి ఉంటుంది. రెగ్యులేటర్‌ స్విచ్‌ నాబ్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో తెలుసుకోవాలి. రెగ్యులేటర్‌ను నిలువుగా వాల్వుమీద ఉంచి కిందకు నొక్కి రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేసి గ్యాస్ సిలిండర్ ను వినియోగించుకోవాలి.