https://oktelugu.com/

RRR రిలీజ్ సంక్రాంతికా..? మ‌హేష్‌-ప‌వ‌న్ ఏం చేస్తారు?

రాజ‌మౌళి సినిమా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుందో.. అంతగా ఆల‌స్యం అవుతుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఈ RRR స‌ల్ల‌గుండా ఇది ఓ ప‌ట్టాన పూర్త‌య్యేలా క‌నిపించ‌ట్లేదు. అస‌లే మెగా-నంద‌మూరి హీరోలు క‌లిసి న‌టిస్తుండ‌డం.. అందునా రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ కావ‌డం.. వీరిద్ద‌రినీ జ‌క్క‌న్న డైరెక్ట‌ర్ చేస్తుండ‌డంతో ఫ్యాన్స్ అక్క‌డెక్క‌డో అంత‌రిక్షంలో అంచ‌నాలు తిప్పేస్తున్నారు. అయితే.. వారెంత‌గా ఎదురు చూస్తున్నారో.. ఈ సినిమా అంత‌గా లేట్ అవుతోంది! Also Read: క్యాన్స‌ర్ బాధిత అభిమానికి ప‌వ‌న్ స్ప‌ర్శ‌.. కంట‌త‌డి పెట్టిన […]

Written By:
  • Rocky
  • , Updated On : March 10, 2021 / 03:25 PM IST
    Follow us on


    రాజ‌మౌళి సినిమా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుందో.. అంతగా ఆల‌స్యం అవుతుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఈ RRR స‌ల్ల‌గుండా ఇది ఓ ప‌ట్టాన పూర్త‌య్యేలా క‌నిపించ‌ట్లేదు. అస‌లే మెగా-నంద‌మూరి హీరోలు క‌లిసి న‌టిస్తుండ‌డం.. అందునా రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ కావ‌డం.. వీరిద్ద‌రినీ జ‌క్క‌న్న డైరెక్ట‌ర్ చేస్తుండ‌డంతో ఫ్యాన్స్ అక్క‌డెక్క‌డో అంత‌రిక్షంలో అంచ‌నాలు తిప్పేస్తున్నారు. అయితే.. వారెంత‌గా ఎదురు చూస్తున్నారో.. ఈ సినిమా అంత‌గా లేట్ అవుతోంది!

    Also Read: క్యాన్స‌ర్ బాధిత అభిమానికి ప‌వ‌న్ స్ప‌ర్శ‌.. కంట‌త‌డి పెట్టిన ప‌వ‌ర్ స్టార్‌‌.. భారీ సాయం!

    ఇప్ప‌టికే రెండు సార్లు ఆల‌స్య‌మైన ఈ సినిమా మూడో సారి కూడా వాయిదా ప‌డనుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొద‌ట‌గా.. గ‌తేడాది జులై 30న రిలీజ్ అనుకున్నారు. కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న అన్నారు. అది కూడా సాధ్యం కాక‌పోవ‌డంతో రాబోయే అక్టోబ‌రు 13ను ఫిక్స్ చేశారు. ఇదే ఫైన‌ల్ అన్నారు. కానీ.. మూడో సారి కూడా డేట్ మారేట్టు క‌నిపిస్తోంద‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

    జ‌క్క‌న్న నెమ్మ‌దిగా చెక్క‌డంతోపాటు రామ్ చ‌ర‌ణ్ ఆచార్య‌ కోసం అద‌నంగా త‌న డేట్లు కేటాయించాల్సి వ‌చ్చింది. ఆచార్య‌లో చెర్రీ రోల్ అర‌గంట నుంచి గంట‌కు పెంచ‌డంతో అనివార్యంగా త‌న ‌RRR డేట్స్ కొన్ని ఆచార్య‌కు ఇచ్చేశాడు. దీంతో.. ఇటు షూట్ లేటైంది. ఇక‌, కొన్ని షెడ్యూల్స్ అనుకున్న స‌మ‌యానికి పూర్తి కాలేదు. మొత్తంగా సినిమా పూర్తి కావ‌డానికి ఇంకా నెల రోజులుపైనే ప‌డుతుంద‌ని స‌మాచారం.

    Also Read: స్టేజ్ పైనే అన‌సూయ‌ను అక్క‌డ ప‌ట్టుకున్నాడు‌.. చూసిన ‌వారంతా షాక్!

    షూట్ పూర్త‌యిన త‌ర్వాత వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ భారీగా ఉంటుంది. రాజ‌మౌళి సినిమాలో గ్రాఫిక్స్ వ‌ర్క్ భారీగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అది పూర్త‌వ్వ‌డానికి ఎంత కాలం పుడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో ఇత‌ర భాష‌ల్లోని డ‌బ్బింగ్ వ‌ర్క్ బ్యాలెన్స్ ఉండ‌నే ఉంది. ఇవ‌న్నీ కంప్లీట్ అయితేనే.. దేశ వ్యాప్తంగా ఒకేసారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ఏది ఆల‌స్య‌మైనా అంతే సంగ‌తులు. అయితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌య‌త్నిద్దాం. లేదంటే వాయిదా వేద్దాం అనే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

    వాయిదా అంటూ ప‌డితే ఇక సంక్రాంతికేన‌ని స‌మాచారం. అదే జ‌రిగితే.. ఇప్ప‌టికే క‌ర్చీఫ్ వేసిన మహేష్, ప‌వ‌న్ ఏం చేస్తార‌న్న‌ది టాక్‌. స‌ర్కారువారిపాట‌, వీర‌మ‌ల్లు సినిమాలు సంక్రాంతి టార్గెట్‌ గానే రెడీ అవుతున్నాయి. మ‌రి, RRRతో వీరిద్ద‌రూ పోటీ ప‌డ‌తారా..? లేదంటే.. అంద‌రూ మాట్లాడుకొని వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తారా? మొత్తంగా.. ఏం జ‌ర‌గ‌బోతోంది? అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్