Happy Friendship Day 2023 : స్నేహితుల దినోత్సవం రోజు ఏం చేస్తారు? ఇది ఎలా పుట్టింది?

స్నేహితుల దినోత్సవం రోజు ఏం చేస్తారు? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. నేటికాలంలో ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ గా మారింది. మనకున్న కష్ట సుఖాలను స్నేహితులతో పంచుకోవడం ద్వారా ఎంతో హాయిగా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : August 6, 2023 9:20 am
Follow us on

International Friendship Day : ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలతో స్నేహబంధం గొప్పది. తల్లిదండ్రులతో కలిసి పంచుకోలేని పలు విషయాలను స్నేహితులతో పంచుకుంటాం.. కష్ట సుఖాలను తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం.. స్కూల్ కెళ్లే వయసు నుంచి ఉద్యోగం చేసే వయసు వచ్చినా.. స్నేహితులు మన వెంటే ఉంటారు. అయితే జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరే ఉంటారు. ఆ ఫ్రెండ్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అదే నిజమైన స్నేహం. ప్రతీ ఏటా స్నేహితుల దినోత్సవంగా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని జరుపుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో జూలై 30న నిర్వహించుకుంటారు. అయితే స్నేహం అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు. కానీ జీవితాంతం మాత్రం ఉంటుంది. అంతటి అందమైన అనుబంధం గురించి ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకం..

స్నేహితుల దినోత్సవానికి ప్రత్యేకంగా ఒకరోజు అంటూ ఉండదు. కానీ ఇప్పుడున్న వాతావరణంలో స్నేహితులతో గడిపే సమయం లేదు. అందువల్ల కొందరు స్నేహితుల దినోత్సవానికి ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు. 20 శతాబ్దం ప్రారంభంలో హాల్ మార్క్ అనే వ్యక్తి ఈరోజును స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. మరొక కథనం ప్రకారం.. 1958లో తొలిసారి పెరూ లో ఫ్రెండ్సిప్ డే గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ తరువాత 2011 లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఫ్రెండ్సిఫ్ డేను ప్రకటించిది. అప్పటి నుంచి కొన్నిదేశాలు జూలై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవాలని మనదేశంలో నిర్ణయించారు.

స్నేహితుల దినోత్సవం రోజు ఏం చేస్తారు? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. నేటికాలంలో ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ గా మారింది. మనకున్న కష్ట సుఖాలను స్నేహితులతో పంచుకోవడం ద్వారా ఎంతో హాయిగా ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని కొన్ని బాధలను స్నేహితులకు చెప్పుకోవడం ద్వారా కాస్త రిలీఫ్ గా ఉంటుంది. అందువల్ల స్నేహితులకు ఒకరోజు కేటాయించాలని ఈరోజును ప్రతిపాదించారు. అయితే చాలా మంది చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకొని, ఆ తరువాత ఉల్లాసంగా గడిపిన వారు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నారు. కొందరు వీలైతే ఈ రోజున కలుసుకుంటారు. లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలతో సరిపెట్టుకుంటారు.

అయితే దైనందిన జీవితంలో అన్ని రకాల అనుభవాలను పొందాలి. ఎన్ని పనులున్నా.. ఎంత బిజీ ఉన్నా స్నేహితులను కలవడం ద్వారా ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఫ్రెండ్స్ ఈరోజున ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. బేధాలను పక్కనబెట్టి మనమంతా ఒక్కటే అనే భావంతో చాలా మంది ప్రెండ్స్ ఈరోజున సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. స్కూల్, కళాశాలలో జరిగిన ఆనాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఒక్కోక్కరికి ఒక్కో రకమైన ఫ్రెండ్ ఉంటారు. కొందరు స్కూల్ వయసులో నుంచి స్నేహం చేస్తూ అలాగే జీవితాంతం వారితో కలిసి ఉంటారు. మరికొందరికి ఉద్యోగ సమయంలో ప్రెండ్సిఫ్ ఏర్పడుతుంది. అయితే స్నేహం ఎలా పుట్టినా నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి కల్మషాలు ఉండవు. ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చేవ్యక్తులు కొందరు ఉన్నారు. అలాంటి స్నేహం దొరకడం అదృష్టంగా భావిస్తారు. అయితే మీకు అలాంటి ఫ్రెండ్ ఉంటే వెంటనే అతనితో ఎంజాయ్ చేయడానికి రెడీ కండి..