Homeఆంధ్రప్రదేశ్‌KCR On Visakha Steel Plant: తెరపైకి విశాఖ ఉక్కు; ఏపీ రాజకీయాలను షేక్ చేసే...

KCR On Visakha Steel Plant: తెరపైకి విశాఖ ఉక్కు; ఏపీ రాజకీయాలను షేక్ చేసే కేసీఆర్ ఎత్తు గడ

KCR On Visakha Steel Plant
KCR On Visakha Steel Plant

KCR On Visakha Steel Plant: భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చిన తర్వాత, దాని ఆంధ్రప్రదేశ్ శాఖకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా చేసిన తర్వాత, మహారాష్ట్రలో వరుస సమావేశాలు నిర్వహించిన తర్వాత.. కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టాడు. ఎవర్ని ఎవర్నో చేర్చుకునే బదులు.. అసలు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. లో తెరపైకి వచ్చిందే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని దక్కించుకొని.. ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని తలపోస్తున్నాడు.

వాస్తవంగా విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇటీవల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఆహ్వానించింది. ప్రైవేట్, ఇతర స్టీల్ అనుబంధం రంగాల కంపెనీలు ప్లాంట్ నిర్వహణకు అవసరమైన మూలధనాన్ని అందించి తమ ఉత్పత్తులను తీసుకోవాలని పేర్కొంది. గత 27న దీనికి సంబంధించి వైజాగ్ స్టీల్ యాజమాన్యం ప్రకటన జారీ చేసింది. ఈనెల 15వ తేదీ మధ్యాహ్న వరకు ఆసక్తి గల కంపెనీలు బెడ్ దాఖలు చేయవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేసే సన్నాహాల్లో భాగంగా ఆర్ ఐ ఎన్ ఎల్ ద్వారా కేంద్రం ఈ ఈవోఐని విడుదల చేయించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ కూడా రాశారు.

ఇక లేఖ రాయడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిలో పనిగా భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నేతలు విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఈకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టు పనులకు అవసరమైన స్టీల్ నేరుగా కొనుగోలు చేయాలని, ఎందుకు అవసరమైన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈవోఐ లో పాల్గొనాలని కెసిఆర్ నిర్మించినట్టు తెలుస్తోంది.

KCR On Visakha Steel Plant
KCR On Visakha Steel Plant

అయితే ఈ ఈవోఐ లో నేరుగా పాల్గొనే అధికారం ప్రభుత్వాలకు లేదు. కేవలం కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. అదే సమయంలో బొగ్గు, తెలుపక నిజం సరఫరా చేసే సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొనవచ్చని ఈవోఐ నోటిఫికేషన్ లో స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారుల బృందం ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లి అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే సింగరేణిలో రాష్ట్రానికి 51, కేంద్రానికి 49% వాటా ఉన్న విషయం తెలిసిందే.. నేపథ్యంలో బిడ్డింగ్ నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తుది నిర్ణయమా లేక కేంద్రం ప్రభుత్వం ఏమైనా కొర్రీలు పెడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ బిల్డింగ్లో పాల్గొనడం ద్వారా భారత రాష్ట్ర సమితికి పొలిటికల్ గా మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం లాభదాయక సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే విపక్షాలు ఇంతవరకు గగ్గోలు పెట్టాయి తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏకంగా ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏకంగా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నది.. ఒకవేళ ఈ బిడ్డింగ్ గనుక దక్కించుకుంటే కేంద్రంపై నైతిక విజయం సాధించినట్లు అవుతుంది. దీన్ని ఉదాహరణగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో జాతీయ పార్టీగా దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది.. ఇక పీవీ నరసింహారావు, వాజ్ పేయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన మూలధన నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారానే అందించారు. ఒకవేళ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంతిమంగా ఆ బాటలో పయనించక తప్పదు అనే భావనలో భారత రాష్ట్ర సమితి నేతలు ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular