
Katie Black: సినిమాల్లో శృంగార తారలకు గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. వారికి ప్రత్యేక అభిమానులు కూడా ఉంటారు. అయితే సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించినంత మాత్రాన బయట కూడా అలాగే ఉంటారనుకోరు. ఎందుకంటే సినిమా వేరు లైఫ్ వేరు. అయితే ఇక్కడ ఓ శృంగార తార తనపై ఎలాగో ఆ ముద్ర ఉంది కాబట్టి బహిరంగంగా చేస్తే తప్పేంటి అని భావించింది. అయితే అది ఆమె వ్యక్తిగతం. కానీ, ఆ పాడు పని పవిత్ర ప్రదేశంలో చేయడమే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. పవిత్ర ప్రదేశాల గౌరవం మంట కలుస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
కొలంబియాలోని ఒక పర్వతాన్ని స్థానికులు పవిత్రంగా పరిగణిస్తారు. రోజూ వందలాదిమంది భక్తులతోపాటు, పర్యాటకులు ఈ పర్వతాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. పైకి చేరేందుకు దాదాపు 800 మెట్లు ఎక్కాలి. ఈ పర్వతాన్ని మౌంట్ గ్వటాపేగా పిలుస్తుంటారు. ఇక్కడికి హాలీవుడ్ శృంగార తార కేటీ బ్లాక్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసివచ్చింది. పైకి వెళ్లారు అంతా బాగానే ఉంది. అలాగే బుద్ధిగా కిందకు వచ్చి ఉంటే ఎలాంటి అలజడి ఉండేది కాదు.
నిర్మానుష్య ప్రదేశంలో ఆపని..
అయితే కేటీ బ్లాక్ కిందకు దిగే సమయంలో ఎవరూ లేని ప్రదేశంలో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అసభ్య చేష్టలు పాల్పడింది. పవిత్ర ప్రదేశంలో తప్పు చేయడమే కాకుండా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు పెయిడ్ వెబ్‌సైట్‌లోనూ పోస్టు చేసింది.
అడల్ట్ వీడియోలు తీసే ఆమె కొన్నింటిని పే సైట్లలో పోస్టు చేస్తుంటుంది.. ఆమెకు ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. అయితే ఆమె ఇటీవల పవిత్ర స్థలంలో చేసిన చర్యకి కొలంబియా వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి
కేసు నమోదు చేస్తామన్న పోలీసులు..
కొలంబియాలో రోజురోజుకూ శృంగార తారపై ప్రజాగ్రహం ఎక్కువ కావడంతో ఈ అంశం పోలీసుల దృష్టికి వచ్చింది. దేశ ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశంలో కేటీ బ్లాక్ తన ప్రియుడితో చేసిన పని తగదని, దీనిపై కచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని పోలీసులు ప్రకటించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన వారు అక్కడి సంప్రదాయాలను, విశ్వాసాలను కచ్చితంగా పాటించాలని స్థానిక న్యాయవాదులు సూచించారు. పవిత్ర ప్రదేశాలుగా పరిగణించే ప్రాంతాల్లో ఇలాంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడటం తగదని ఇలాంటి వారికి తగినశిక్ష విధిస్తే ఇతరులకు కూడా భయం కలుగుతుందని వారు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు విదేశీ పర్యాటకుల జంట తప్పతాగి వీధుల్లో నగ్నంగా పరిగెత్తిన అంశాన్ని వారు గుర్తుచేశారు. వీరిని కూడా త్వరలోనే పట్టుకొని కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.