ట్రంప్ ను టార్గెట్ చేసేశారు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పురిగొలిపారంటూ.. ఆయన్ను అభిశంసించే దిశగా డెమొక్రాట్లు గట్టిగా వాదన వినిపిస్తున్నాయి. నాటి దాడికి సంబంధించి మునుపెన్నడూ కనిపించని కీలక వీడియోలను తాజాగా బయటపెట్టారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా పలువురు పలువురు ఆందోళన కారులు అమెరికా చట్ట సభలపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులపై దాడికి దిగడం వంటి దారుణాలన్నీ.. ఆ వీడియోల కనిపించాయి. ట్రంప్ పై కేసులో ఈ […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 11:22 am
Follow us on


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పురిగొలిపారంటూ.. ఆయన్ను అభిశంసించే దిశగా డెమొక్రాట్లు గట్టిగా వాదన వినిపిస్తున్నాయి. నాటి దాడికి సంబంధించి మునుపెన్నడూ కనిపించని కీలక వీడియోలను తాజాగా బయటపెట్టారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా పలువురు పలువురు ఆందోళన కారులు అమెరికా చట్ట సభలపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులపై దాడికి దిగడం వంటి దారుణాలన్నీ.. ఆ వీడియోల కనిపించాయి. ట్రంప్ పై కేసులో ఈ వీడియో బలమైన ఆధారంగా నిలిచే అవకాశం ఉంది.

Also Read: భారత్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చిన అమెరికా

ట్రంప్ ను అభింసంశించేందుకు ఉద్దేశంచిన తీర్మానంపై సెనేట్లో బుధవారం విచారణ ప్రారంభం అయ్యింది. జామీ రస్కిన్ సహా పలువురు డెమోక్రాటిక్ నేతలు మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. ట్రంప్ అమాయక వీక్షకుడు కాదని రస్కిన్ పేర్కొన్నారు. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను నిర్వర్తించాల్సిన విధులను విస్మరించారని దేశ ప్రజలను రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని పరిక్షిస్తానని ప్రమాణం చేసి ఉల్లంఘించారని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించకుండా.. అడ్డుకునేలా మద్దతుదారులను రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు.

తన కుటుంబసభ్యులు ఉన్నచోటుకు 100 అడుగుల చేరువలోకి నాడు ఆందోళన కారులు అంత్యంత ప్రమాదకర రీతిలో వెళ్లారని మరో డెమొక్రాటిక్ నేత ప్లాస్కెట్ తెలిపారు. ఆ రోజు ఆందోళనకారులకు ప్రతినిధుల సభ స్పీకర్ నానీస పెలోసీ చిక్కుంటే.. ఆమెను చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. డెమొక్రాటర్ల అనంతరం ట్రంప్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అభిశంసన తీర్మాణానికి సెనేట్లో ఆరుగురు రిపబ్లికన్లు మద్దతు తెలపడం గమనార్హం.

Also Read: చైనానే సూపర్ యాప్ లు ఎందుకు తయారు చేస్తోంది..?

మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్, నాన్సీ పెలోసీల కోసం ఆందోళన కారులు ఆగ్రహంతో వెతకడం తాజా వీడియోలో కనిపించింది. దాడి ఘటనతో చట్టసభ్యులు కలవరపడడం, పెన్స్ సహా ఆయన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచేందుకు అధికారులు అక్కడి నుంచి తీసుకెళ్లడం.. పోలీసులపై ఆందోళన కారులు దాడి చేయడం.. పెన్స్ ను ఉరి తీయండంటూ.. నినాదాలు చేయడం వంటి దృశ్యాలు వీడియోల నిక్షిప్తమై ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

ఇంతకుముందు ఎన్నడూ.. బయటకు రాని ఓ ఆడియో క్లిప్ ను కూడా డెమోక్రాటిక్ నేతల అభిశంసన తీర్మానంపై విచారణలో భాగంగా బయటపెట్టారు. క్యాపిటల్ హిల్ వద్ద ఆందోళన కారుల చేతిలో గాయపడిన పోలీసులు చేసిన హాహాకారాలు అందులో వినిపించాయి. వాళ్లు మా పై ఇనుప కడ్డీలు విసురుతున్నారు.. అంటూ పోలీసులు చెప్పడం అదనపు బలగాల కోసం విన్నవించడం వంటివి ఆడియోలో ఉన్నాయి.