Guntur Karam First Review: గుంటూరు కారం మొట్టమొదటి రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

మహేష్ బాబు మీద త్రివిక్రమ్ తీసిన సీన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయట. ఇక మహేష్ బాబు, శ్రీలీల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందట.

Written By: NARESH, Updated On : January 7, 2024 1:02 pm

Guntur Karam First Review:

Follow us on

Guntur Karam First Review: మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయ్యింది. యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం రివ్యూ బయటకు వచ్చింది. మూవీ ఎలా ఉందో చూద్దాం. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మాస్, ఎమోషన్ , కామెడీ, యాక్షన్ కలగలిపి తెరకెక్కించారట. త్రివిక్రమ్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడట.

ఇక కథ విషయానికి వస్తే… హీరోయిన్ శ్రీలీల వెరీ రిచ్. తనకు లేదనేది ఉండదట. అలాంటి అమ్మాయి జీవితం మాత్రం షార్ట్. కొద్ది రోజుల్లో చనిపోతుందట. అలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చిన మహేష్ బాబు ఏం చేశాడు అన్నదే కథ అట. మూవీలో ట్విస్ట్ లు అలరిస్తాయి అంటున్నారు. గుంటూరు కారం పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటున్నారు.

మహేష్ బాబు మీద త్రివిక్రమ్ తీసిన సీన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయట. ఇక మహేష్ బాబు, శ్రీలీల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందట. గుంటూరు కారం సంక్రాంతి విన్నర్ అవుతుందని అంటున్నారు. మూవీ విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది.

హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని కొందరి వాదన. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న 3వ చిత్రం ఇది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.