Homeఎంటర్టైన్మెంట్F3 team Comedy వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

F3 team Comedy వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

F3 team Comedy హాట్ సమ్మర్ లో వస్తోన్న మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి బూస్ట్ నిచ్చేలా ఈ మూవీ రూపొందింది. ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ సహా చిత్రం యూనిట్ అంతా సందడి చేస్తోంది. ప్రమోషన్స్ ను పీక్ స్టేజీకి తీసుకెళుతోంది.

2019లో విడుదలై ఫన్ ఫుల్ సక్సెస్ సొంం చేసుకున్న ‘ఎఫ్2’కి కొనసాగింపుగా ఎఫ్3 సిద్ధమైంది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ‘ఎఫ్3’ టీం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలోనే భాగంగా తెరపై చిరంజీవి, బాలయ్య, నాగార్జున పవర్ ఫుల్ డైలాగుల వీడియోలను ప్రదర్శించి వాటిని అచ్చం అలాగే అనుకరించాలని చిన్న టాస్క్ ఆడారు.

వరుణ్ తేజ్, వెంకటేశ్ , ఇతర చిత్రబృందం రెండు టీంలుగా విడిపోయి నాన్ స్టాప్ ఫన్ అందించారు. చిరు,బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్ ప్లే చేసి రీల్స్ చేయాలన్నారు. దీంతో వెంకీ, వరుణ్ జట్లు పోటీపడి సరదాగా కామెడీ చేశారు.

సుమ యాంకర్ గా సాగిన ఈ స్కిట్ లు నవ్వులు పూయించాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ నే కాదు.. అలీ, ఫృథ్వీ, మెహరీన్, ఆఖరుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీల్స్ చేసి అలరించారు. అందరిలోకి దర్శకుడు అనిల్ రావిపూడి యాక్టింగ్ అదుర్స్ అనేలా ఉంది.

F2 vs F3 Hilarious Game @ F3 Movie FUNtastic Event | Venkatesh, Varun Tej | Shreyas Media
Recommended videos
మహేష్ - త్రివిక్రమ్ మూవీ లో మరో స్టార్ హీరో | Mahesh -Trivikram Movie Latest Update | SSMB28 Update
Sai Kumar Speech at Black Movie trailer Launch || Black Telugu Movie Trailer Launch || Sai Kumar
సుమ 3.0  కామెడీ విత్ ప్రగతి | Suma Making Hillarious FUN With Actress Pragathi Aunty | F3 Pre Event

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version