Ex minister Naryana in ap cid custody : ‘నారాయణ.. నారాయణ’.. టీడీపీ హయాంలో మంత్రిగా వెలుగు వెలిగిన ఈయనకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో గడ్డు కాలమే ఎదురవుతోంది. ఎందుకంటే ఏపీలో జగన్ చేస్తున్న విద్యా సంస్కరణలు ఈయన ఆధ్వర్యంలో నడిపిస్తున్న కార్పొరేట్ ‘నారాయణ విద్యాసంస్థలకు’ ఎసరు తెస్తోందన్న విమర్శలు వైసీపీ నుంచి ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ఇంగ్లీష్ మీడియం వద్దని గతంలో గోల చేశారని.. చంద్రబాబు, ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు..జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి తాజాగా పదోతరగతి పేపర్ల లీక్ లు ‘నారాయణ విద్యాసంస్థల్లోనే’ జరిగాయని వారు అంటున్నారు.

ఇటీవల తిరుపతిలో పర్యటించిన సీఎం జగన్ చేసిన విమర్శ ఏపీ రాజకీయాల్లో సంచలమైంది. ఏపీలో పదోతరగతి పేపర్ల లీక్ ను కావాలనే రాజకీయం చేశారని.. ఇందులో టీడీపీ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థలదే కీలక పాత్ర అని.. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లోనే పేపర్లు లీక్ అయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక సీఎంగా ఉండి రెండు భారీ పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలపై జగన్ చేసిన విమర్శలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఇది ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది.
Also Read: Babu Gogineni vs CPI Narayana: బిగ్ బాస్ లొల్లి: సీపీఐ నారాయణ Vs బాబు గోగినేని.. ఎవరిది తప్పు?
ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు ఊతమిస్తూ తాజాగా హైదరాబాద్ లోని కేపీహెచ్.బీలోని లోదా అపార్ట్ మెంట్ లో ఉన్న మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీకి తీసుకెళ్లడం సంచలనమైంది. మొదట నారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నారాయణతోపాటు ఆయన సతీమణి రమాదేవిని వారి సొంత వాహనంలోనే పోలీసులు ఏపీకి తరలించడం సంచలనమైంది.

ఏపీలో పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లేదా ఏ కేసులో తీసుకున్నారనే విషయంపై ఏపీ పోలీసులు మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే నారాయణ విద్యాసంస్థల నుంచే పదోతరగతి పేపర్లు లీక్ అయ్యాయని.. పోలీసులకు పక్కా ఆధారాలు దొరికాయని.. అందుకే ఈ అరెస్ట్ లు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. పదోతరగతి పరీక్షల పేపర్లలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీలో టెన్త్ పేపర్ల లీక్ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వ ఫెయిల్యూర్ గా చిత్రీకరించడానికి ప్రతిపక్షం టీడీపీ చేయని పని లేదు. టీడీపీ అనుకూల మీడియా దీన్ని రచ్చరచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఈ లీకేజీ వ్యవహారాన్ని టీడీపీ మెడకే చుట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసి వాళ్ల నోళ్లు మూయించడానికి జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను ఈ కేసులో బుక్ చేసినట్లుగా అర్థమవుతోంది.
Also Read: Namitha : ఆ ఫొటోలు షేర్ చేసిన నమిత .. చూసి అంతా షాక్.. వైరల్
Recommended Video:


