https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీరేటులో కోత..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దేశంలోని 6 కోట్ల మంది చందాదారులపై ప్రతికూల ప్రభావం పడేలా పీఎఫ్ వడ్డీరేటు విషయంలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా విజృంభణ వల్ల విత్‌డ్రాయెల్స్ పెరగడం, కంట్రిబ్యూషన్స్ తగ్గడంతో కేంద్రం వడ్డీరేటులో కోత విధించనుందని సమాచారం. మార్చి 4వ తేదీన ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. Also Read: ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. విజృంభిస్తున్న ఎబోలా..? నివేదికలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 17, 2021 / 12:23 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దేశంలోని 6 కోట్ల మంది చందాదారులపై ప్రతికూల ప్రభావం పడేలా పీఎఫ్ వడ్డీరేటు విషయంలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా విజృంభణ వల్ల విత్‌డ్రాయెల్స్ పెరగడం, కంట్రిబ్యూషన్స్ తగ్గడంతో కేంద్రం వడ్డీరేటులో కోత విధించనుందని సమాచారం. మార్చి 4వ తేదీన ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    Also Read: ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. విజృంభిస్తున్న ఎబోలా..?

    నివేదికలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నాయని చెబుతున్నాయి. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. ఒక అంచనా ప్రకారం గతేడాది దాదాపు 2 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు 73 వేల కోట్ల రూపాయలు వెనక్కు తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారా.. సబ్సిడీ ఎలా తెలుసుకోవాలంటే..?

    ఈపీఎఫ్‌వో రాబోయే రోజుల్లో వడ్డీరేట్లను తగ్గిస్తే పీఎఫ్ ఖాతాదారులకు తక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్రం ఈపీఎఫ్ లో ఉద్యోగుల వాటా రెండున్నర లక్షలు దాటితే కేంద్రం వడ్డీపై పన్ను విధించనుంది. మార్చి 4వ తేదీన ఈపీఎఫ్‌వో మీటింగ్ జరగనుండగా మీటింగ్ తరువాత వడ్డీ రేటు తగ్గింపుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన ఈపీఎఫ్‌వో మీటింగ్ జరగనుంది. పీఎఫ్ సబ్ స్క్రైబర్లకు ఝలక్ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయనుందని వస్తున్న వార్తలు పీఎఫ్ ఖాతాదారులను టెన్షన్ పెడుతున్నాయి.