రోడ్డుమీద లుంగీలు అమ్ముకునే అలీని.. స్టార్ క‌మెడియ‌న్ గా మార్చింది ఆయ‌నే!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ల జాబితా తీస్తే.. అలీ పేరు ముందు వ‌ర‌సలో ఉంటుంది. త‌న‌దైన మేన‌రిజం.. డైలాగ్ డెలివ‌రీతో.. వెండి తెర‌పై చెరిగిపోని సంత‌కం చేశాడు అలీ. కేవ‌లం ముఖం చూసి, ముఖ క‌వ‌ళిక‌లు చూసి ప్రేక్ష‌కులు న‌వ్వుకునే అతికొద్ది మంది హాస్య‌న‌టుల్లో అలీ అగ్ర‌భాగాన ఉంటారు. బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి 40 సంవ‌త్స‌రాలుగా ఆడియ‌న్స్ ను అల‌రిస్తూనే ఉన్నారు అలీ. అయితే.. ఎలాంటి బ్యాంగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగు పెట్టాడీ సొట్ట‌బుగ్గ‌ల […]

Written By: Bhaskar, Updated On : February 17, 2021 12:33 pm
Follow us on


తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ల జాబితా తీస్తే.. అలీ పేరు ముందు వ‌ర‌సలో ఉంటుంది. త‌న‌దైన మేన‌రిజం.. డైలాగ్ డెలివ‌రీతో.. వెండి తెర‌పై చెరిగిపోని సంత‌కం చేశాడు అలీ. కేవ‌లం ముఖం చూసి, ముఖ క‌వ‌ళిక‌లు చూసి ప్రేక్ష‌కులు న‌వ్వుకునే అతికొద్ది మంది హాస్య‌న‌టుల్లో అలీ అగ్ర‌భాగాన ఉంటారు. బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి 40 సంవ‌త్స‌రాలుగా ఆడియ‌న్స్ ను అల‌రిస్తూనే ఉన్నారు అలీ. అయితే.. ఎలాంటి బ్యాంగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగు పెట్టాడీ సొట్ట‌బుగ్గ‌ల చిన్నోడు. మ‌రి, ఆయ‌నే వ‌చ్చాడా..? అంటే కాద‌ని చెప్పొచ్చు. అయితే, ఎవ‌రు తీసుకొచ్చారు? అంటే.. ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే!

Also Read: కేసీఆర్ పుట్టినరోజుకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్

సీన్ ఓపెన్ చేస్తే.. ఏపీలోని రాజమండ్రిలో ఒక రోజు మోహ‌న్ మిత్ర అనే ఒక వ్య‌క్తి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. అక్క‌డ రోడ్డు ప‌క్క‌న లుంగీలు, చిన్న పిల్ల‌ల గౌన్లు అమ్ముతున్నారు. ఒక లుంగీ తీసుకుందామ‌ని వెళ్లిన ఆ వ్య‌క్తి.. ఎలా అమ్ముతున్నావ్ బాబూ అని అక్క‌డున్న పిల్లాడిని అడిగాడు. దానికి నోటితో అని వెట‌కారంగా స‌మాధానం చెప్పాడ‌ట ఆ కొంటె కుర్రాడు. దీంతో ఆయ‌న కోప‌గించుకున్నారు. ప‌క్క‌న ఉన్న ఆ బాలుడి తండ్రి ప‌రిగెత్తుకొచ్చి, ఆయ‌న‌ను గుర్తు ప‌ట్టారు. సార్‌.. మా వాడు ఏమైనా అన్నాడా? అని ఆరాతీస్తే.. చిరు న‌వ్వు న‌వ్వేసి మీ వాడు మామూలోడు కాదోయ్ అన్నార‌ట‌. వీణ్ని ఇక్క‌డ ఉంచావేంటీ అని అడిగితే.. చ‌దువు స‌రిగా అబ్బ‌ట్లేద‌ని చెప్పాడ‌ట‌. దీంతో ఆయ‌న క‌న్ను ఆ బుడ్డోడిపై ప‌డింది. ఆ చిన్నోడే మ‌న అలీ. ఆ వ్య‌క్తి పేరు మోహ‌న్ మంత్రి. రాజ‌మండ్రిలో పెద్ద ఆర్కే స్ట్రా ఓన‌ర్‌.

సీన్ క‌ట్ చేస్తే.. ఆర్కే స్ట్రా గ్రూప్ లో మెంబ‌రు గా మారిపోయాడు అలీ. ఆ స్టేజ్ షోల‌లో మ‌నోడు ఇర‌గ‌దీసేవాడ‌ట‌. సినిమాలో డైలాగులు.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మిమిక్రీ.. హీరోల డ్యాన్స్ స్టెప్పులతో హ‌వా న‌డిపించేవాడ‌ట ఆ బుడ్డోడు. ఈ క్ర‌మంలోనే ఓ రోజు డైరెక్ట‌ర్ విశ్వనాథ్ మోహ‌న్ మిత్ర‌ను క‌లిసి, త‌న‌కు ఓ పిల్లవాడు కావాలి అని అడిగార‌ట‌. దీంతో.. అలీని చూపించారు మిత్ర‌. ఆ త‌ర్వాత విశ్వ‌నాథ్ గారు పెట్టిన ‘టెస్టు’లో ఫస్ట్ క్లాసులో పాసైపోయాడు అలీ.

Also Read: ఆ నేతపై టాలీవుడ్ లో మరో బయోపిక్.. పెను దుమారం..

ఈ సీన్ కూడా కట్ చేస్తే.. ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ సినిమాలో కెమెరా ముందుకు వచ్చేశాడు బుల్లి అలీ. ఆ తర్వాత దర్శకుడు భారతీ రాజా తీసిన ‘సీతాకోక చిలుకలు’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. అటు సినిమాలు చేస్తూనే గురువుతో ఆర్కెస్ట్రా షోలు కూడా చేసేవాడు. ఆ విధంగా.. మెల్ల మెల్లగా మొదలైన అలీ సినీ ప్రయాణం.. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మాదిరిగా దూసుకెళ్లింది. స్టార్ కమెడియన్ గా స్థిరపడిపోయాడు. ఆ తరువాత ‘యమలీల’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, హీరో కూడా అయిపోయాడు. అయితే.. హీరో అయినప్పటికీ.. తన కామెడీ ట్రాక్ ను మాత్రం వదులుకోలేదు అలీ.

అలీ ఇండస్ట్రీకి వచ్చి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మధ్య సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి చీఫ్ గెస్ట్ గా సీఎం వచ్చారు. అప్పుడు అలీని సన్మానిస్తూ ఉంటే ‘నాకొద్దు మా అమ్మకి, మా గురువుగారికి సన్మానం చేయండి’ అని చెప్పి తన కృతజ్ఞత చాటుకున్నాడు. ఇప్పుడు సినిమాలతోపాటు బుల్లితెరపై టాక్ షోలు కూడా చేస్తున్నారు అలీ. అంతేకాకుండా.. ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకుంటున్నాడు. రాజకీయాల్లోకి కూడా రావాలని ప్రయత్నించి, ఆగిపోయారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలో అలీ కనిపిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్