England Vs Australia Ashes: ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియా జట్టు 2-1 తో సిరీస్ లో ఆధిక్యంలో ఉంది. జట్ల పరంగా చూస్తే రెండు బలమైనవే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నవే. కానీ, ఈ సిరీస్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు వెనుకబడిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా మొదటి, రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. అయితే, దీనికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ జట్టులోని బ్యాటింగ్ విభాగం రాణించకపోవడమే. సాధారణంగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లోను బలంగా కనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ లో కీలక ఆటగాళ్లు రాణించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు తేలిపోతున్నారు. ఒకవైపు స్టేలియా ఆటగాళ్లు రాణిస్తుంటే.. ఇంగ్లాండ్ జట్టు కీలక ఆటగాళ్లు చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్ చివరి దశలో ఇంగ్లాండ్ జట్టు పట్టు సడలిస్తుండడంతో మొదటి, రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. మూడో టెస్టులో మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వచ్చింది. మూడో టెస్ట్ లో ఎవరైతే జట్టులోకి చేరారో వారే అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించగలిగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ మూడో టెస్ట్ లో జట్టులో చేరిన ఆటగాళ్ళు అదరగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి.. యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా అధిక్యాన్ని 2-1 కి తగ్గించగలిగింది.
సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరం..
ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. మిగిలిన రెండు టెస్టుల్లో తప్పక విజయం సాధిస్తేనే ఇంగ్లాండ్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. కానీ, వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించడం అంత సులభం ఏమీ కాదు. మొదటి, రెండు టెస్టుల్లో ఓటమిపాలై.. చివరి మూడు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడం అన్నది చరిత్రలో ఒకేసారి జరిగింది. చరిత్రను తిరగరాయాలి అంటే ఇంగ్లాండ్ కీలక ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జో రూట్, హ్యరీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో బ్యాట్ల నుంచి అతి పెద్ద ఇన్నింగ్స్ లు రావాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఈ నలుగురు స్థిరంగా ప్రదర్శన ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకరు ఆడితే మరో ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించాలంటే వీరు నలుగురు తప్పక రాణించాల్సిన అవసరం ఏర్పడింది. వీరితోపాటు మిగిలిన ఆటగాళ్లు రాణిస్తే ఇంగ్లాండ్ జట్టు మిగిలిన రెండు టెస్టుల్లో సులభంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మూడో టెస్ట్ నుంచి జట్టులో చేరిన మొయిన్ అలీ, క్రిష్ వోక్స్, మార్క్ వుడ్.. ఇటు బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ లోను రాణిస్తుండడంతో ఇంగ్లాండ్ బలం పెరిగింది. ఆ నలుగురు ఆటగాళ్లు కూడా బ్యాట్లు ఝలిపిస్తే ఇంగ్లాండ్ జట్టుకు తిరిగే ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూడాలి ఏ మేరకు మిగిలిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు సమిష్టి ప్రదర్శన చేసి నిలుస్తుందో.
Web Title: England vs australia ashes the same minus for the england team in the ashes series
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com