England vs Australia 3rd Ashes Test: యాషెస్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ గురువారం ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఇంగ్లాండు జట్టు ఈ టెస్ట్ లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. హెడ్డింగ్లెలోని లీడ్స్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పలు మార్పులతో బరిలోకి దిగుతుంది. మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక చతికిల పడిన ఆటగాళ్లను తప్పించి.. వారి స్థానంలో సీనియర్ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ జట్టు చోటు కల్పిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు చేస్తున్న ఈ మార్పులు ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయి అన్నది చూడాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు తడబడుతోంది. మొదటి టెస్ట్ లోను, రెండో టెస్టులోనూ విజయానికి దగ్గరగా వచ్చి ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని చేజార్చుకుంది. ఇంగ్లాండ్ జట్టుకు గత కొన్నాళ్లుగా విజయాలను అందించి పెడుతున్న బజ్ బాల్ వ్యూహం కూడా విజయాలను అందించడం లేదు. వేగంగా ఆడి ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచాలన్న ఇంగ్లాండ్ వ్యూహం ఈ సిరీస్ లో మాత్రం బెడిసి కొడుతోంది. వేగంగా ఆడే క్రమంలో వికెట్లను పోగొట్టుకుంటున్న ఇంగ్లాండు జట్టు తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలోనే విజయానికి దగ్గరగా వచ్చి నిలిచిపోతోంది ఇంగ్లాండు జట్టు. మొదటి రెండు టెస్టుల్లో జరిగిన తప్పిదాల నుంచి గుణ పాఠాలు నేర్చుకుని మెరుగైన ప్రదర్శన చేయాలని ఇంగ్లాండు జట్టు భావిస్తోంది. అందుకు అనుగుణంగా కీలక మార్పులతో మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగుతుంది.
మూడు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్ జట్టు..
మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో పోటీలో నిలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక సిరీస్ కోల్పోయినట్టు అవుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగుతోంది. అందులో భాగంగానే మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయినా ముగ్గురుని తప్పించి.. సీనియర్ ప్లేయర్లను మూడో టెస్ట్ లోకి తీసుకుంటోంది. మొదటి రెండు టెస్టులు ఆడిన పోప్, అండర్సన్, టంగ్ ను తప్పించి.. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, మొయిన్ అలీను జట్టులోకి తీసుకుంది. ఈ ముగ్గురి రాకతో బౌలింగ్ విభాగంతోపాటు బ్యాటింగ్ విభాగం కూడా బలోపేతం అవుతుందని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. వీరి ముగ్గురి టెస్ట్ కెరియర్ కూడా మెరుగ్గానే ఉండడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ ఆశలతోనే ఈ టెస్ట్ లోకి వీరిని బరిలోకి దించుతోంది. వీరి ముగ్గురు ఏ స్థాయిలో ప్రదర్శన ఇవ్వనున్నారో చూడాల్సి ఉంది.
మూడో టెస్ట్ ఆడే ఆటగాళ్లు వీళ్లే..
మూడో టెస్ట్ ఆడే ఆటగాళ్లలో ఇంగ్లాండ్ జట్టు నుంచి.. బెన్ డకెట్, జాక్ క్రావలే, హ్యరీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, క్రిష్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, ఓల్లీ రాబిన్షన్, మార్కువుడ్.
ఆస్ట్రేలియా జట్టు నుంచి.. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ కవాజా, మార్నస్ లబుచేంజ్, స్టీవ్ స్మిత్, హెడ్, కామెరాన్ గ్రీన్/ మిచెల్ మార్స్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాత్ కమిన్స్ (కెప్టెన్ ), స్కాట్ బోలాండ్/ జోష్ హజల్వుడ్, టాడ్ మూర్ఫీ ఆడనున్నారు.
Web Title: England vs australia 3rd ashes test preview and prediction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com