Homeఎడ్యుకేషన్Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా...

Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా చెబుతున్న ఉద్యోగులు!

Employees Says Goodbye To Jobs: కరోనా ప్రపంచానికి చాలా పాఠాలే నేర్పింది. ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం అవసరం, ఆర్థిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలి, పని విధానం ఎలా ఉండాలి, కుటుంబాలతో కలిసి ఉంటే కలిగే లాభాలు, నష్టాలు.. ఇలా అనేక అంశాల్లో మానవాళికి కనువిప్పు కలిగించింది. దీంతో పేద, ధనిక, స్త్రీ, పురుష బేధం లేకుండా లైఫ్‌స్టైల్‌ మార్చుకుటున్నారు. కోరోనా సమయంలో అనేక సంస్థలు మూతపడ్డాయి. కార్పొరేట్‌ సంస్థలు వర్క్‌ఫ్రం హోం అవకాశం ఇచ్చాయి. ఈ విధానం ఇంకా కొన్ని కంపెనీల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకున్న మనిషి, కరోనా కాలంలో ఎదుర్కొన్న ఎడిదుడుకులతో రాటుదేలాడు. ఏ పనైనా చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. దీంతో చాలామంది తమకు నచ్చిన విధంగా పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. దీంతో కంపెనీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు, పని విధానం తమకు నచ్చినట్లుగా ఉంటేనే పనిచేస్తున్నారు. లేదంటే ఆ సంస్థకు గుడ్‌బై చెబుతున్నారు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్పటికీ అమెరికాలో ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి చిన్నచిన్న కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి.

Employees Says Goodbye To Jobs
Employees Says Goodbye To Jobs

గ్రేట్‌ రిసిగ్నేషన్‌ క్యాంపు..

అమెరికాలో 4.7 కోట్ల మంది గతేడాది ఉద్యోగాలు నచ్చలేదని, తమకు నచ్చినట్లుగా పని లేదని ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గత మార్చిలోనే 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారు. వీరంతా ఇప్పుడు తమకు నచ్చిన వేళల్లో పని ఇచ్చే సంస్థలు, తమకు నచ్చినట్లు పని విధానం ఉన్న సంస్థల కోసం వెతుక్కుంటున్నారు. దీంతో చిన్న సంస్థల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనైన సాఫ్ట్‌వేర్, మెడికల్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులు ప్రస్తుతం రిలీఫ్‌ కోరుకుంటున్నవారిలో ఎక్కువగా ఉన్నారు. నచినట్లుగా పనివిధానం ఉంటేనే చేస్తామంటున్నారు. లేదంటే రిజైన్‌ చేస్తున్నారు. వృత్తికి, లైఫ్‌స్టైల్‌కు మధ్య తేడా రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇది ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

Also Read: Villagers For The Dog: కుక్క కోసం ఆ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

మన దేశంలోనూ మార్పు కోరుకుంటున్నారు..

కరోనా కారణంగా జీవితంలో ఎలాగైన బతకగలం అన్న ఒక ధీమా అందరిలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం వరకూ కంపెనీల చుట్టూ తిరిగేవారు కూడా ఇప్పుడు పనివిధానం నచ్చే కంపెనీల కోసం, తమకు అనుకూలంగా ఉన్న కంపెనీల కోసం వేచిచూస్తున్నారు. మన దేశంలోనూ చాలామంది ఉద్యోగాల మార్పు కోరుకుంటున్నారు. ఐటీ, టెలికాం సంస్థల్లో పనిచేస్తున్న 86 శాతం మంది ఉద్యోగాలు మారాలనుకుంటున్నట్లు మైకేల్‌ పేజ్‌ సర్వేలో తేలింది. వీరిలో చాలామందికి ఐదు నుంచి పదేళ్ల అనుభవం ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో టీసీఎస్‌లో17.4 శాంత, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు ఆయా కంపెనీలను వీడారు. నచ్చిన పని విధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్‌ లేకున్నా పర్వాలేదనే భావనలో మన దేశంలో 60 శాతమంది ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో 2021 నుంచి లక్షల మంది ఉద్యోగులు కంపెనీలను వీడుతుండడంతో గ్రేట్‌ రిసిగ్నేషన్‌ అని అన్నారు టెక్సాస్‌ ఎంఎం వర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోని క్లోస్‌.

Employees Says Goodbye To Jobs
Employees Says Goodbye To Jobs

మారుతున్న కంపెనీల తీరు..

గ్రేట రిసిగ్నేషన్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది నచ్చిన ఉద్యోగం లేదని రాజీనామా చేస్తుండడంతో దీనిని ఎదుర్కొనేందుకు కంపెనీలే పని విధానం మార్చుకుంటున్నాయి. అమేజాన్, గూగుల్‌ వంటి సంస్థలు అనేక మార్పులకు శ్రీకారం చుట్టాయి. పని విధానంలో మార్పు చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఇంటి నుంచి కొంత, ఆఫీస్‌ నుంచి కొత పనిచేసే విధానం తీసుకొస్తున్నాయి. పిన్‌ట్రెస్ట్‌ సంస్థ ఏకంగా బిడ్డల సంరక్షణ బాధ్యతలను కూడా తాము తీసుకుంటామని ప్రకటించింది. ఉద్యోగాలకు సెలవులు కూడా ఇస్తామని తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్‌ కంపెనీ డాబే తమ సంస్థలో పనిచేసేందుకు వచ్చే వారికి నగదు గిఫ్ట్‌ కూడా ఇస్తోంది. మొదటి రౌండ్‌లో 550 డాలర్లు, రెండో రౌండ్‌కు వస్తే 1100 డాలర్లు ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఐదుగురిలో ఒకరు వీలైనంత త్వరగా ఉద్యోగం మానేయాలని భావిస్తున్నారు. ఈమేరకు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అధిక జీతం కోసం 44 శాతం మంది కంపెనీ మారాలనుకుంటున్నామని సర్వేలో తెలిపారు, వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం లేకనే సంస్థలు వీడాలనుకుంటున్నామని మరో 44 శాతం మంది చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20 శాతం మంది ఐటీ ఉద్యోగుల మాత్రమే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: Malavika Mohanan: అందాల హీరోయిన్ కి ఒంటి నిండా వెంట్రుకలే.. ఫోటోలు వైరల్ !

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular