Eagle: ఈగల్ మూవీ స్టోరీ ఇదేనా..? రజినీకాంత్ సినిమా స్టోరీ ని కాపీ చేశారా..?

ఈగల్ సినిమా వచ్చేనెల 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా భారీ అంచనాలను తట్టుకొని ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

Written By: Gopi, Updated On : January 20, 2024 1:58 pm

Eagle

Follow us on

Eagle: రవితేజ హీరోగా ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన హీరో గా ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ప్లాప్ అయిన సరే ఒక్కసారి మనం చూడచ్చు అనేలా మినిమం గ్యారంటీ సినిమాలు చేస్తూ ఉంటాడు… అలాంటి రవితేజ భారీ అంచనాలు పెట్టుకొని చేసిన ఈగల్ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈగల్ సినిమా వచ్చేనెల 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా భారీ అంచనాలను తట్టుకొని ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చకు దారితీస్తుంది. అయితే ఈ సినిమా రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా తెలుస్తుంది. ‘ఒక డాన్ గా ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబాన్ని చంపేసిన మనుషుల కోసం తిరుగుతూ వాళ్ళని వెతికి వెంటాడి చంపడమే ఈ సినిమా కథ’ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది ఈ స్టోరీ కబాలి సినిమా స్టోరీ లాగానే ఉందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా స్టోరీ ఇదేనా లేదంటే వేరే ఇంకేదైనా ఉందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…అయితే ఈ సినిమాతో రవితేజ మరొకసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ట్రైలర్ ను మనం చూసినట్టయితే రవితేజ గెటప్ చాలా కొత్తగా ఉండటమే కాకుండా తనలో ఒక కృయాల్ మనిషి ఉన్నట్టు గా కూడా కనిపిస్తుంది. అంటే తన ఫ్యామిలీని చంపిన వాళ్లను ఈగల్ లాగా ఒక కన్ను వేసి వెతుకుతూ వారిని ఎక్కడున్నా సరే పట్టుకొని క్రూరంగా చంపాబోతున్నట్టు గా ఆ క్రూరత్వం తనలో కనిపించేలా తన గెటప్ డిజైన్ చేశారు.

ఇక ఈ సినిమాతో రవితేజ సక్సెస్ కొడితే కొంతమంది స్టార్ డైరెక్టర్ల నుంచి కూడా తనకి మంచి అవకాశాలు అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మరి తను ఈ సినిమాతో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో వాటి ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమా రవితేజ ను సక్సెస్ తీరాలకు చేరుస్తుందా లేదా హ్యాట్రిక్ ప్లాపులను కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది…