Chandrababu Jail: బాబు ఒక్క రోజు జైలు ఖర్చు ఎంతో తెలుసా?

సుప్రీంకోర్టు ఖరీదైన లాయర్ గా గుర్తింపు పొందిన సిద్ధార్థ లుధ్రాను రంగంలోకి దించారు. రోజుకు కోట్లు కుమ్మరిస్తున్నారు. అయినా బెయిల్ రావడం లేదు. అరెస్ట్ అయిన రోజే చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందని ఆశించారు.

Written By: Dharma, Updated On : October 28, 2023 1:54 pm

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: చంద్రబాబు అరెస్టుతో ఏపీ పొలిటికల్ సీన్ మారింది. ఈ అరెస్టు చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నిత్యం ఏదో ఓ కేసు విచారణ, పిటిషన్, నోటీసులు అనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ కేసుల ప్రారంభం నుంచి టిడిపి నేతలు పెద్దగా సీరియస్ తీసుకోలేదు. సింపుల్ గా బెయిల్ వస్తుందని భావించారు. కనీసం చంద్రబాబు అరెస్ట్ అవుతారని కూడా ఊహించలేదు. అటు చంద్రబాబు సైతం తనను అరెస్టు చేస్తారని చెప్పినా పెద్దగా ఎవరు రియాక్ట్ కాలేదు. అలా జరగదులే అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు అరెస్టు అయ్యారు. బెయిల్ లభించడం లేదు. గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలుగా మారాయి. కానీ ఇంతవరకు ఊరట దక్కడం లేదు.

సుప్రీంకోర్టు ఖరీదైన లాయర్ గా గుర్తింపు పొందిన సిద్ధార్థ లుధ్రాను రంగంలోకి దించారు. రోజుకు కోట్లు కుమ్మరిస్తున్నారు. అయినా బెయిల్ రావడం లేదు. అరెస్ట్ అయిన రోజే చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందని ఆశించారు. కానీ కోర్టు రిమాండ్ విధించడంతో అంతా షాక్ కు గురయ్యారు. అటు తరువాత క్వాష్ పిటిషన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏసీబీతోపాటు హైకోర్టులో ఆ పిటిషన్ డిస్మిస్ కు గురైంది. సుప్రీంకోర్టులో విచారణలు సాగినా తీర్పు నవంబర్ 8న వెల్లడించనున్నారు. మరోవైపు హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినా.. అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. ఇప్పటివరకు చంద్రబాబు కేసుల్లో జరిగింది ఇది.

అయితే చంద్రబాబు కేసు విచారణలో భాగంగా భారీగా ఖర్చు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రోజుకు 25 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోనే టాప్ లాయర్లుగా పేరుందిన హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్ర, అభిషేక్ మను సింగ్విలు ఇప్పటివరకు చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. మరో 50 మంది వరకు న్యాయ నిపుణులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఒకానొక దశలో అత్యున్నత ధర్మాసనం సైతం చంద్రబాబు తరుపు వాదనలు ఎంతమంది సీనియర్ న్యాయవాదులు వినిపిస్తారంటూ చమత్కరించడం గమనార్హం.

ఇందులో హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఈయన రోజుకు 12 నుంచి 14 లక్షల వరకు ఫీజుగా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 1999 నుంచి 2002 వరకు ఈయన దేశ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేయడం విశేషం. అటు సిద్ధార్థ లూద్రా కూడా పేరు మోసిన న్యాయవాదే. 2012లోనే ఈయన అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గా నియమించబడ్డారు. ఒక్కరోజు వాదించేందుకు పది లక్షలకు పైగా ఫీజుగా తీసుకుంటారని ప్రచారం ఉంది. అభిషేక్ మను సింగ్వి కూడా పేరు మోసిన లాయర్. కాంగ్రెస్ నాయకుడు కూడా. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇతను సైతం రోజుకు 10 లక్షలు కన్నా ఎక్కువ ఫీజు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఏపీకి వచ్చిన సమయంలో ఈ లాయర్లంతా రోజుకు కోటి రూపాయల ఫీజు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిని ధ్రువీకరించే వాస్తవాలేవీ బయట పడే వీలు లేదు. అయితే 50 రోజుల చంద్రబాబు రిమాండ్ లో తెలుగుదేశం పార్టీ 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

చంద్రబాబు కోసం రాజమండ్రి జైల్లో కోర్టు ఆదేశానుసారం ఏపీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. బాబు కోసం ఆ స్నేహ బ్లాక్ మొత్తాన్ని ఖైదీలను పెట్టకుండా ఆయనకే కేటాయించింది. ఖైదీలందరినీ దూరంగా తరలించింది. దీని కోసం 50వేల నుంచి లక్ష వరకూ ఖర్చు అయినట్టు సమాచారం. ఇక చంద్రబాబు కోసం టవర్ ఏసీ సౌకర్యం, ఫ్యాన్లు, బెడ్స్, చుట్టూ సీసీ కెమెరాల కోసం 10 లక్షల వరకూ ప్రభుత్వం ఖర్చు చేసింది.. ఎంత లేదనుకున్నా చంద్రబాబు కోసం ఒక్కరోజుకు ఏపీప్రభుత్వం 50 వేల నుంచి లక్ష వరకూ ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. దేశంలో హేమాహేమీలకు లేని జైలు వసతులు చంద్రబాబుకు ఉండడం వల్లనే ఇంతటి భారీ ఖర్చు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత ఖర్చు అవసరమా? అని అంటున్నారు.