https://oktelugu.com/

NTR And Krishna: సీనియర్ ఎన్టీయార్ కి, కృష్ణ కి మధ్య జరిగిన గొడవ లో లాభపడిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

స్టార్ హీరోగా ఎదిగిన మరొక నటుడు నాగేశ్వర రావు. వీళ్ళిద్దరిని ఇండస్ట్రీకి రెండు కండ్లు అభివర్ణిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 10, 2024 / 10:41 AM IST
    Follow us on

    NTR And Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సీనియర్ ఎన్టీఆర్. ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు కూడా ఈయనే కావడం విశేషం. ఇక పౌరాణికాల్లో ఈయన చేసినటువంటి పాత్రలు ఇప్పటివరకు ఇండియా లో ఉన్న ఏ ఒక్క నటుడు కూడా పోషించలేదు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇండస్ట్రీ లో చాలా పాత్రలను చేసి మెప్పించాడు.

    ఇక తనతో పాటుగా స్టార్ హీరోగా ఎదిగిన మరొక నటుడు నాగేశ్వర రావు. వీళ్ళిద్దరిని ఇండస్ట్రీకి రెండు కండ్లు అభివర్ణిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు. తాను వీళ్లేవరిని పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లూరి సీతారామరాజు సినిమాని ఎన్టీఆర్ తీయాలనుకున్నాడు కానీ ఆ సినిమాని కృష్ణ తీసి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకోవడంతో ఎన్టీఆర్ కూడా కృష్ణని అభినందించాడు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరికీ సినిమాల పరంగా కొంత డిఫరెన్స్ అయితే వచ్చింది.

    దాని వల్లే కృష్ణ చేయాల్సిన ‘ దేవదాసు’ సినిమాని ఎన్టీఆర్ దగ్గరుండి మరి నాగేశ్వరరావు తో చేయించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక కృష్ణ ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదు అనే ఒకే ఒక కారణం తో కృష్ణని కాదని ఎన్టీఆర్ నాగేశ్వరరావుతో దేవదాస్ సినిమా చేసేలా ప్రణాళికలు రూపొందించాడు. కృష్ణ ఎన్టీఆర్ మధ్య కొద్దిరోజుల పాటు ఇలాంటి కోపతాపాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కలిసిపోయారు.

    అయితే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నప్పుడు, కృష్ణ చేయాల్సిన సినిమాలని ఎన్టీఆర్ సపోర్టుతో నాగేశ్వరరావు చేసి భారీ హిట్లను అందుకున్నాడు. ఇక వీళ్ళిద్దరి గొడవలో ఎక్కువగా లాభపడింది నాగేశ్వరరావు అనే చెప్పాలి… అలా ఇండస్ట్రీ లో కొందరి మైనస్ లు మరి కొందరికి ప్లస్ లు అవుతాయి.అందుకే ఇండస్ట్రీ లో ఏం చేసిన, ఎవరితో మాట్లాడిన జాగ్రత్త ఉండాలి…