Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడానికి కారణం ఎవరో తెలుసా..?

చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి యూత్ మొత్తాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను తీసుకున్నాడు.

Written By: Gopi, Updated On : January 22, 2024 10:31 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి ఏం చేసినా కూడా దాని వెనుక పవన్ కళ్యాణ్ ఉండేవాడు.

అలాంటి సందర్భంలోనే వీళ్లిద్దరు కూడా హీరోలుగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి యూత్ మొత్తాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో తను విపరీతమైన ప్రచారాలు చేస్తూ పార్టీ ని గెలిపించడానికి చాలా కష్టపడ్డాడు అయినప్పటికీ పార్టీ గెలవలేకపోయింది. అయితే అల్లు అరవింద్ ప్రజా రాజ్యం పార్టీ కి సంభందించిన భాద్యతలను ఎక్కువగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు పార్టీ మీటింగ్ జరిగినప్పుడు అల్లు అరవింద్ చిరంజీవితో పవన్ కళ్యాణ్ ని ఇటు పంపించండి ఆ హీరోని అటు పంపించండి అని కొంచెం మర్యాద లేకుండా మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో తెలియజేశాడు.

తనని కేవలం ఒక హీరో గానే భావించారు తప్ప తన వల్ల ఎంతమంది పార్టీ లో జాయిన్ అయ్యారో ఆ విషయాన్ని అల్లు అరవింద్ గారు గమనించలేకపోయారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు గా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కి అది నచ్చక తను జనసేన పార్టీ పెట్టుకున్నాడు. దాంతో ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2014 స్థాపించిన ఈ జనసేన పార్టీ ఇప్పటికీ పొలిటికల్ పార్టీగా కొనసాగుతుంది.

అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా కొనసాగుతుంది ఇక ఇప్పుడు 2024 లో వచ్చే ఎలక్షన్స్ లో ఈ పార్టీ భారీ సీట్లను కైవసం చేసుకోబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ జనాల గురించి ఆలోచించే మనిషి కాబట్టి జనాలలో ఉండాలనే ఉద్దేశ్యం తోనే ఈ జనసేన పార్టీని పెట్టుకున్నట్టుగా కూడా అప్పట్లో తనొక క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు…