HBD Superstar MaheshBabu Records: మహేష్ బాబు మాత్రమే అందుకున్న ఆ రికార్డు ఏమిటో తెలుసా…

'సర్కారు వారి పాట’ కంటే ముందు మహేష్ బాబు హీరోగా నటించిన ’శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను అందుకున్నాయి.

Written By: Swathi, Updated On : August 9, 2023 10:08 am

Mahesh Babu Records

Follow us on

Mahesh Babu Records: టాలీవుడ్ ప్రిన్స్ ఎవరు అంటే మనకు వెంటనే వినిపించే పేరు మహేష్ బాబు. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా అందం తగ్గుతుందేమో ఈయనకు మాత్రం తన్నులకొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9వ తేదీతో 44వ సంవత్సరానికి అడుగుపెడుతున్న ఈ హీరో సినిమా రంగంలో 24 యేళ్లు పూర్తి చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగానే అయినా, మహేష్ బాబు తండ్రికి మించిన తనయుడు అనిపించుకొని, ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదుగుతూ వచ్చారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఈ జనరేషన్‌లో ఎవరు అందుకోని ఓ రికార్డు అందుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రికార్డు ఏమిటో ఒకసారి చూద్దాం.

వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట కలెక్షన్స్ పరంగా యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్‌ ను క్రాస్ చేసింది. ఈ సినిమాతో మరోసారి యూఎస్ తెలుగు ప్రేక్షకుల్లో మహేష్ బాబుకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏంటో అర్థమయింది. అయితే ఇదేమి ఈ హీరోకి కొత్త కాదు. తెలుగు ఇండస్ట్రీలో 1 మిలియన్ యూఎస్ డాలర్స్‌ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం. అక్కడ మహేష్ బాబుకు ఇది 11వ 1 మిలియన్ డాలర్స్‌ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది.

అయితే ఈ సినిమా ఒక మిలియన్ తో సరిపెట్టుకోలేదు. కొద్దిరోజుల తరువాత యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ డాలర్స్‌ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇలా ఈ హీరో సౌత్ ఇండియా నుంచి యూఎస్ మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్స్‌ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి.

పోనీ రెండు మిలియన్ లతో ఆగారా అంటే అది కూడా కాదు. సర్కారు వారి పాట సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు మరి కొన్ని రోజుల తర్వాత చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘సర్కారు వారి పాట’ కంటే ముందు మహేష్ బాబు హీరోగా నటించిన ’శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను అందుకున్నాయి. మొత్తంగా ’సర్కారు వారి పాట’ మూవీతో మహేష్ బాబు సంచలనాలకు వేదికగా నిలిచారు.

మరోవైపు ఈయన హీరోగా నటించిన 27 చిత్రాల్లో 11 చిత్రాలు యూఎస్ మార్కెట్‌లో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసాయి. ఈ రకంగా యూఎస్ మార్కెట్‌లో అత్యధిక 1 మిలియన్ డాలర్స్ అందుకున్న హీరోగా మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేసాడు. అందులో 9 చిత్రాలు వరుసగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ వసూళు చేయడం అంటే మాములు విషయం కాదు.

ఇలా ఇప్పటి హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డుని కొల్లగొట్టి తన నిజంగా సూపర్ స్టార్ అని మన హీరో రుజువు చేసుకున్నారు. మరి మన టాలీవుడ్ ప్రిన్స్ ఇక సూపర్ స్టార్ కి మరోసారి మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.