https://oktelugu.com/

నెమలి పించం ఇంట్లో పెట్టుకుంటున్నారా… అయితే ఏం జరుగుతుందో తెలుసా..!

అన్ని పక్షులలో కెల్లా నెమలికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నెమలి మన జాతీయ పక్షిగా గుర్తించడమే కాకుండా, నెమలి పురివిప్పి నాట్యం ఆడితే కనుసొంపుగా ఉంటుంది.సాధారణంగా మనం చిన్నప్పుడు లేదా ప్రస్తుతం చిన్న పిల్లలు ఈ నెమలి పించంలను తీసుకుని పుస్తకాలలో పెట్టుకుంటూ ఎంతో ఆనంద పడుతుంటారు. మరికొందరు నెమలి పింఛాలతో వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేసుకొని ఇంటిలో అలంకరించుకుంటారు. అయితే కొందరు నెమలిపింఛంను ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతారు. మరికొందరు నెమలి పించం ఇంట్లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 23, 2021 11:34 am
    Follow us on

    Peacock Feather

    అన్ని పక్షులలో కెల్లా నెమలికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నెమలి మన జాతీయ పక్షిగా గుర్తించడమే కాకుండా, నెమలి పురివిప్పి నాట్యం ఆడితే కనుసొంపుగా ఉంటుంది.సాధారణంగా మనం చిన్నప్పుడు లేదా ప్రస్తుతం చిన్న పిల్లలు ఈ నెమలి పించంలను తీసుకుని పుస్తకాలలో పెట్టుకుంటూ ఎంతో ఆనంద పడుతుంటారు. మరికొందరు నెమలి పింఛాలతో వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేసుకొని ఇంటిలో అలంకరించుకుంటారు. అయితే కొందరు నెమలిపింఛంను ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతారు. మరికొందరు నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయని భావిస్తారు. అయితే నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: ఏకంగా 256 ఏళ్ళు జీవించిన వృద్ధుడు.. రహస్యం ఏమిటంటే..?

    పురాణాల ప్రకారం నెమలి ఎంతో అందవిహీనంగా ఉండేది. కానీ ఒక సందర్భంలో ఇంద్రుడు ఒక రాక్షసుడు నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన ప్రాణాలను నెమలి పింఛంలో దాచాడు.ఈ విధంగా రాక్షసుడు నుంచి తన ప్రాణాలను కాపాడిన నెమలికి ఎంతో అందమైన రూపాన్ని ఇంద్ర దేవుడు వరంగా ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి నెమలి ఎంతో అందమైన పక్షి గా పేరుగాంచింది.వాస్తు పరంగా నెమలిపింఛం మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గ్రహాలలో రాహువు పాక్షికంగా పాము రూపంలో ఉంటాడు కాబట్టి పాముకు నెమలి బద్ధశత్రువు కావడంతో నెమలి పించం మన ఇంట్లో ఉండటం వల్ల ఎటువంటి రాహు దోషాలు ఉండవు.

    Also Read: సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలు..?

    మన ఇంటి దక్షిణదిశలో నెమలి పించం పెట్టడం వల్ల మన ఇంటిలో అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా నెమలిపింఛం చిన్న పిల్లలు తల కింద పెట్టడం వల్ల వారిపై ఎటువంటి చెడు ప్రభావం, చెడు దృష్టి ఉండదని చెబుతారు. అదే విధంగా నెమలి పించాన్ని పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల వారికి సరస్వతి ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. ఏది ఏమైనా నెమలిపింఛం మన ఇంట్లో ఉండటం వల్ల అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం